Speaker Election: దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొలిసారిగా స్పీకర్ పోస్టు కోసం అధికార, ప్రతిపక్షాలు పోటీ పడుతున్నాయి. అధికార ఎన్డీయే ప్రభుత్వం తన స్పీకర్ అభ్యర్థిగా ఓం బిర్లాను నామినేట్ చేసింది.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో రాత్రి 8 గంటలకు ఇండియా కూటమి ఫ్లోర్ లీడర్లు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ఇదిలా ఉంటే సోమవారం నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి.
18వ పార్లమెంట్ సమావేశాలు సోమవారం సందడిగా సాగాయి. సార్వత్రిక ఎన్నికల్లో తమ అద్భుతమైన ప్రదర్శనతో ఉల్లాసంగా ఉన్న ప్రతిపక్ష ఎంపీలు.. 18వ లోక్‌సభ సభ్యునిగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు రాజ్యాంగం కాపీలను ఊపుతూ నిరసన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ముందు వరుసలో కూర్చుని నాయకత్వం వహించారు. గత పార్లమెంట్ సమావేశాల్లో రాహుల్ గాంధీ రెండో వరుసలో కూర్చున్నారు.…
Teesta water issue: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రెండు రోజుల క్రితం భారత పర్యటనకు వచ్చారు. ప్రధాని నరేంద్రమోడీతో పలు ఒప్పందాలు చేసుకున్నారు. దీంట్లో తీస్తా నది నీటి నిర్వహణపై మోడీ-హసీనాలు చర్చించారు. అయితే, దీనిపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు.
Suryakanta Patil: మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికల్లో పేలవమైన పనితీరు కనబరిచిన బీజేపీకి షాక్ తగిలింది. మాజీ కేంద్ర మంత్రి సూర్యకాంత పాటిల్ కాషాయ పార్టీకి గుడ్‌బై చెప్పారు. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి ఆమె రాజీనామా చేశారు. గత 10 ఏళ్లలో తానను చాలా నేర్చుకున్నానని, ఇందుకు పార్టీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆమె రాజీనామా తర్వాత అన్నారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ తనపై చేసిన ఆరోపణపై చర్చించడానికి రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ మంగళవారం ఇండియా కూటమి నేతలను కోరారు. ఈ క్రమంలో కూటమి నేతలకు లేఖ రాశారు. ఆ లేఖలో.. తనపై దుర్వినియోగానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు అవమానించడం, హత్యకు ప్లాన్ చేశారని లేఖలో పేర్కొంది. "నా పాత్రపై ఎడతెగని దాడులను ఎదుర్కొన్నాను.. అంతేకాకుండా.. నా స్వంత పార్టీ నాయకులు, వాలంటీర్లు.. నా ప్రతిష్ట, పాత్ర, విశ్వసనీయతను అణగదొక్కడానికి ఒక…
త్వరలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఇటీవల విడుదలైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో మరోసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు.
RSS: బీజేపీ సైద్ధాంతిక సంస్థ ఆర్ఎస్ఎస్ వరసగా ఆ పార్టీపై విమర్శలు చేస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మెజారిటీ రాలేదు. 543 సీట్లున్న లోక్సభలో మెజారిటీ 272 సీట్లు కాగా, కమలానికి 240 సీట్లు మాత్రమే వచ్చాయి.