INDIA Bloc: సాయంత్రం ఖర్గే ఇంట్లో ఇండియా కూటమి నేతల భేటీ.. స్పీకర్ ఎన్నికపై చర్చ
- సాయంత్రం ఖర్గే ఇంట్లో ఇండియా కూటమి నేతల భేటీ
- స్పీకర్ ఎన్నికపై చర్చ... కాంగ్రెస్ నుంచి సురేష్ నామినేషన్
- డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తే పోటీ నుంచి తప్పుకుంటామన్న కాంగ్రెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో రాత్రి 8 గంటలకు ఇండియా కూటమి ఫ్లోర్ లీడర్లు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ఇదిలా ఉంటే సోమవారం నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన ఎంపీలంతా ప్రమాణస్వీకారం చేశారు. ఇక బుధవారం లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఇందుకోసం నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఈసారి ఎన్నడూ లేని విధంగా స్పీకర్ పదవికి పోటీ నెలకొంది. ఎన్డీఏ కూటమి నుంచి ఓం బిర్లా నామినేషన్ వేయగా.. ఇండియా కూటమి నుంచి కె.సురేష్ నామినేషన్ దాఖలు చేశారు. దీంతో స్పీకర్ ఎన్నికకు పోటీ నెలకొంది.

Also Read
సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి పోటాపోటీగా సీట్లు గెలుచుకున్నాయి. ఎన్డీఏ కూటమి 293 సీట్లు గెలుచుకోగా.. ఇండియా కూటమి 233 సీట్లు గెలుచుకుంది. ఇక కాంగ్రెస్ సొంతంగా 99 సీట్లు గెలుచుకుని ప్రతిపక్ష హోదాను సంపాదించింది. అయితే ఇండియా కూటమి డిప్యూటీ స్పీకర్ పదవిని ఆశిస్తోంది. ఈ పదవి ఇస్తే.. ఎన్డీఏ కూటమి బలపరిచిన స్పీకర్ అభ్యర్థికి సపోర్టు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఒకవేళ అంగీకరించకపోతే స్పీకర్ పోస్టుకు పోటీ చేస్తామని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Prize Money: కోట్లు గెలిచాడు.. సంతోషంలో గుండెపోటుతో పోయాడు..
కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. డిప్యూటీ స్పీకర్ పోస్టుపై ఎన్డీఏ నిర్ణయానికి ఎదురుచూస్తున్నామన్నారు. డిప్యూటీ స్పీకర్ పదవిని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే.. తాము ఎన్డీఏ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రధాని మోడీ విజ్ఞప్తి చేసినట్లుగా ఉభయ సభల్లో సభ సజావుగా సాగేందుకు సహకరిస్తామని వెల్లడించారు. అలాగే కేంద్రం కూడా ప్రతిపక్షాలను గౌరవించవలసి ఉంటుందన్నారు. కాంగ్రెస్ హయాంలో 10 ఏళ్లు డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు ఇచ్చినట్లు గుర్తుచేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఇచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. అలాగే లోక్‌సభలో కూడా ఇవ్వాలని వేణుగోపాల్ డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Kalki 2898 AD: “నన్ను చంపొద్దు ప్లీజ్” ప్రభాస్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన అమితాబ్.. ఎందుకో తెలుసా?
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!