కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీహార్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పాట్నాలోని భక్తియార్‌పూర్‌లో ఏర్పాటు చేసిన ఇండియా కూటమి ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నిపథ్ స్కీమ్‌ను రద్దు చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. జూన్ 4న ఇండియా కూటమి సంకీర్ణ ప్రభుత్వం రాబోతోందని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అగ్నివీర్ పథకాన్ని అంతం చేస్తామని పేర్కొన్నారు.
Sonia Gandhi: కాంగ్రెస్ నేత, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ ఢిల్లీ ఓటర్లను ఉద్దేశించి వీడియో సందేశంలో ప్రసంగించారు. మే 25న ఆరో విడత ఎన్నికల్లో భాగంగా ఢిల్లీలోని 7 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగబోతోంది.
Arvind Kejriwal: లోక్‌సభ ఎన్నికల తర్వాత ఇండియా కూటమి అధికారంలోకి వస్తే తాను తదుపరి ప్రధాని కాగలననే ఊహాగానాలకు ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తెరదించారు.
Prashant Kishor: ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ప్రధాని నరేంద్రమోడీ మరోసారి విజయపథంలో నిడిపించే అవకాశం ఉందని ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు.
ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ప్రస్తుత రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ తనపై దాడి చేసిన కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ విభవ్ కుమార్‌పై రాత పూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. సీట్ల పంపకంలో తేడా రావడంతో ఇండియా కూటమితో విభేదించిన ఆమె ప్రస్తుతం ఆ కూటమికి జై కొట్టారు. ఎన్నికల తర్వాత కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు తమ పార్టీ బయటి నుంచి మద్దతు ఇస్తుందని మమతా బెనర్జీ వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ..
PM Modi: బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీ ఇండియా కూటమిపై విరుచుకుపడ్డారు. ‘‘పాకిస్తాన్ అణుశక్తికి బయపడే పిరికివాళ్లు’’గా అభివర్ణించారు.
Congress: ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అయోధ్యలో రామ మందిరాన్ని శుద్ధి చేస్తామని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.