Swati Maliwal: విభవ్ కుమార్ పై ఎఫ్ఐఆర్ నమోదు.. కేసు దర్యాప్తులో నిమగ్నమైన 10 బృందాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ప్రస్తుత రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ తనపై దాడి చేసిన కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ విభవ్ కుమార్‌పై రాత పూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిన్న రాత్రి పోలీసులు బాధితురాలు స్వాతి మలివాల్‌ను వైద్య పరీక్షల నిమిత్తం ఎయిమ్స్‌కు తీసుకెళ్లారు. మలివాల్ 4 గంటల పాటు ఎయిమ్స్‌లోనే ఉన్నారు. రాత్రి 11 గంటల సమయంలో ఢిల్లీ పోలీసులు స్వాతి మలివాల్‌ను ఎయిమ్స్‌లోని ట్రామా సెంటర్‌కు తీసుకువచ్చారు. అదే సమయంలో ఆజ్ తక్ కరస్పాండెంట్ స్వాతి మలివాల్‌తో విచారణ కోసం ఢిల్లీ మహిళా కమిషన్ (DCW) బృందం కూడా AIIMSకి చేరుకుంది.
READ MORE: IPL 2024 Playoffs: హైదరాబాద్‌కు గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే సెకండ్ ప్లేస్ పక్కా!
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
కాగా.. కేసు నమోదు అనంతరం నార్త్ జిల్లా పోలీసు బృందం, క్రైమ్ బ్రాంచ్ కేసును దర్యాప్తు చేయడం ప్రారంభించింది. ముందుగా ఢిల్లీ పోలీసు బృందం విభవ్ కుమార్ ఇంటికి చేరుకుంది. విభవ్ అక్కడ లేరు. ఇంట్లో అతని భార్య ఉంది.ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్ ఈరోజు(శుక్రవారం) ఉదయం 11 గంటలకు విభవ్ కుమార్‌ను హాజరు కావాలని ఆదేశించిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం లక్నో విమానాశ్రయంలో అరవింద్ కేజ్రీవాల్‌తో విభవ్ కుమార్ కనిపించారు. ఇండియా కూటమి నేతల సంయుక్త విలేకరుల సమావేశంలో పాల్గొనేందుకు కేజ్రీవాల్ లక్నో వచ్చారు. పోలీసులు ఇప్పుడు టైమ్‌లైన్ ద్వారా మొత్తం సంఘటనను సీక్వెన్స్ చేస్తున్నారు. సీక్వెన్స్ ప్రకారం.. విభవ్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడానికి పోలీసులు సీసీటీవీని ఫుటేజీ సహాయం తీసుకున్నారు. ఈ రోజు మహారాష్ట్రలో ఇండియా కూటమి ర్యాలీ ఉంది. విభవ్ మహారాష్ట్రకు వెళ్లి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దాదాపు 10 పోలీసు బృందాలు దర్యాప్తులో నిమగ్నమయ్యాయి. అందులో నాలుగు బృందాలు విభవ్ ఎక్కడున్నాడో కనుగొనేందుకు యత్నిస్తున్నాయి.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..