Prashant Kishor: బీజేపీ 370 సీట్లు దాటదు, కానీ.. పీకే ప్రిడిక్షన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prashant Kishor: ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ప్రధాని నరేంద్రమోడీ మరోసారి విజయపథంలో నిడిపించే అవకాశం ఉందని ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంగళవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్న బీజేపీపై ప్రజలకు కోపం పెద్దగా లేదని చెప్పారు. అయితే, బీజేపీ చెబుతున్నట్లు 370 సీట్లను మాత్రం దాటకపోవచ్చని చెప్పారు.
మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూమి అధికారంలోకి వస్తుందని తాను భావిస్తున్నానని, అయితే గత ఎన్నికల్లో(2019) పొందిన సీట్ల సంఖ్యను లేదా కొంచెం ఎక్కువ స్థానాలు గెలువవచ్చని ఆయన అంచనా వేశారు. వారు చెబుతున్నట్లు 370 సీట్లు రాకపోవచ్చని అన్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వంపై కోపం ఉంటే, దానికి ప్రత్యామ్నాయం ఉండాలి అప్పుడే ప్రజలు వారికి ఓటేయాలని నిర్ణయించుకుంటారని ఆయన అన్నారు. మోడీపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోందనే వాదనల్ని మనం ఎప్పుడూ వినలేదని చెప్పారు.
Also Read
- Sushila Devi Inspirational Story: 63 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన బామ్మ.. 79.6 శాతం మార్కులతో అదరగొట్టిందిగా..
- Jantar Mantar Protest: తీహార్ జైలుకు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా..
- Explainer: యువత ఆరోగ్యానికి "రాజకీయ" గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
- Marco Rubio: మరోసారి భారత్ టూర్కు మార్కో రూబియో.. ముంబై, గుజరాత్లో పర్యటన
Read Also: Arvind Kejriwal: నా భార్య ‘‘ఝాన్సీ రాణి’’.. సునీతా కేజ్రీవాల్‌ని ప్రమోట్ చేస్తున్న ఆప్ చీఫ్..
ఉత్తర, పశ్చిమ భారతదేశంలో దాదాపుగా 325 లోక్‌సభ స్థానాలు కలిగి ఉందని, ఈ బెల్టు బీజేపీకి 2014 నుంచి బలమైన కోటగా ఉందని, తూర్పు-దక్షిణ ప్రాంతాల్లో బీజేపీకి పెద్దగా పట్టు లేదని, ఏదైనా నష్టం జరిగితే అది ఉత్తరం, పశ్చిమ భారతదేశాల్లోనే జరగాలని ప్రశాంత్ కిషోర్ విశ్లేషించారు. అయితే, ఈ సారి దక్షిణాదిన, తూర్పున బీజేపీకి ఓట్లు, సీట్లు పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే ఈసారి కూడా బీజేపీకి సీట్లు తగ్గే ఛాన్స్ చాలా తక్కువగా ఉందని అన్నారు.
మోడీ తప్పిదాలను ఇండియా కూటమి ఉపయోగించుకోలేదని అన్నారు. ఇండియా కూటమి కార్యరూపం దాల్చే సమయానికి చాలా ఆలస్యమైందన్నారు. ప్రధాన మంత్రి అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంలో కూటమి విఫలమైందని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా స్ట్రాంగ్ వ్యక్తి, బలమైన కథనం లేదని చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికలతో సహా బీజేపీని ఓడించడమే తమ లక్ష్యం అని చెబుతున్న ప్రతిపక్షాలు గతేడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో దారుణంగా విఫలమైనట్లు తెలిపారు.
తాజావార్తలు
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Hyderabad: ఉప్పల్లో మ్యాచ్కు ముందు సంచలనం.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అరెస్ట్..!
-
21st Century Best Bowler: 21వ శతాబ్దపు టాప్-10 బౌలర్లు.. టాప్ లేపిన ఆసీస్ దిగ్గజం.. బుమ్రా స్థానం ఎక్కడో తెలుసా?
-
Sushila Devi Inspirational Story: 63 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన బామ్మ.. 79.6 శాతం మార్కులతో అదరగొట్టిందిగా..
ట్రెండింగ్
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!