Arvind Kejriwal: లోక్‌సభ ఎన్నికల తర్వాత ఇండియా కూటమి అధికారంలోకి వస్తే తాను తదుపరి ప్రధాని కాగలననే ఊహాగానాలకు ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తెరదించారు. ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఉంటారనే దానిపై కూడా పెద్దగా స్పందించలేదు. అలాంటి చర్చ జరగలేదని, ఎన్నికల ఫలితాల తర్వాత ఇండియా కూటమి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఆప్ చిన్న పార్టీ అని, ఈ ఎన్నికల్లో కేవలం 22 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోందని చెప్పారు. తనకు తక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పకనే చెప్పారు.
Read Also: kidnapping: టర్కీ నుంచి కంబోడియా వరకు.. డబ్బు కోసం భారతీయులను కిడ్నాప్ చేస్తున్న పాకిస్తానీలు..
నియంతృత్వం నుంచి దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే ఈ ఎన్నికలు జరుగుతున్నాయని కేజ్రీవాల్ అన్నారు. పీటీఐతో మాట్లాడిన కేజ్రీవాల్ ‘‘ఇండియా కూటమి గెలిస్తే తదుపరి ప్రధాని కావాలనే ఉద్దేశ్యం నాకు లేదు’’ అని అన్నారు. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే ప్రతిపక్ష నేతలందరిని జైలులో పెట్టడం ఖాయమని ఆరోపించారు. వారు మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యాన్ని అంతం చేస్తారని కేజ్రీవాల్ అన్నారు. గతంలో కూడా ప్రధాని పదవి గురించి మాట్లాడుతూ.. తాను రేసులో లేని లక్నోలో చెప్పారు.
గత ఏడాది జూన్ నెలలో బీజేపీ, ప్రధాని నరేంద్రమోడీని ఎదుర్కొనేందుకు ఇండియా కూటమి ఏర్పడింది. ఈ కూటమిలో కాంగ్రెస్‌తో పాటు కేజ్రీవాల్ కీలకంగా వ్యవహరించారు. అయితే, తన ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరనేదానిని పక్కన పెట్టి విపక్షాలు అన్నీ కలిసి పోటీ చేస్తున్నాయి. ఇదే విమర్శనాస్త్రంగా బీజేపీ ఇండియా కూటమిని ప్రశ్నిస్తోంది. ప్రతిపక్షాలకు దేశాన్ని అభివృద్ధి చేయాలనే కోరిక లేదని, వారి కుటుంబాలను అభివృద్ధి చేసుకోవాలనే కోరిక మాత్రమే ఉందని ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలు విమర్శిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీని వంశపారంపర్య పార్టీగా బీజేపీ అభివర్ణిస్తోంది. సమాజ్‌వాదీ, ఆర్జేడీ పార్టీలనున కూడా ఇదే విధంగా విమర్శిస్తోంది.