Rahul Gandhi: ‘‘అందుకే ప్రధాని మోడీని దేవుడు పంపాడు.’’ రాహుల్ గాంధీ సెటైర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ.. తనను దేవుడు పంపాడని చెప్పారు. అయితే, ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీల వంటి పారిశ్రామికవేత్తల కోసం ప్రధాని నరేంద్రమోడీని పరమాత్మ పంపారని, పేదల కోసం కాదని రాహుల్ గాంధీ మంగళవారం అన్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని డియోరియాలో జరిగిన ఎన్నికల్లో రాహుల్ మాట్లాడుతూ.. ‘‘ప్రతీ ఒక్కరు జీవసంబంధం కలిగి ఉంటారు, ప్రధాని నరేంద్రమోడీ మాత్రం జీవసంబంధమైనవారు కాదు. అంబానీ, అదానీలకు సాయం చేయడాని అతడిని పరమాత్మ పంపింది, పేదలకు, రైతులకు సాయం చేయడానికి కాదు’’ అని అన్నారు. దేవుడు వారిని పంపి ఉంటే, అతను పేదలకు, రైతులకు సాయం చేసి ఉండేవారు, అతను ఎలాంటి దేవుడు.? అని ప్రశ్నించారు.
Read Also: Shraddha Walkar case: శ్రద్ధావాకర్ మర్డర్ కేసులో మరిన్ని ఆధారాలతో మరో ఛార్జిషీట్..
Also Read
- Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
- PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
- Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
చివరి దశ ఎన్నికలు జూన్ 1న జరగబోతున్నాయి. దీని కోసం ఈ రోజు రాహుల్ గాంధీ ఉత్తర్ ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో ప్రధానిని ఉద్దేశించి సెటైర్లు వేశారు. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ ఓ వార్తా ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇస్తూ.. తాను జీవసంబంధమైనవాడిని కాదని, దేవుడిచే పంపబడ్డానని పేర్కొన్నారు. మా అమ్మ బతికున్నంత వరకు తాను బయోలాజికల్‌గా జన్మించానని అనుకునే వాడినని, అయితే ఆమె చనిపోయిన తర్వాత కొన్ని అనుభవాలను బట్టి చూస్తే, తనను దేవుడు పంపాడని నమ్ముతున్నానని అన్నారు.
ఇదిలా ఉంటే, ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిధిని తొలగిస్తుందని హామీ ఇచ్చారు. భారత రాజ్యాంగాన్ని ఇండియా కూటమి కాపాడుతుందని చెప్పారు. రాజ్యాంగాన్ని రక్షించాలని ఇండియా కూటమి ఒకవైపు ఉంటే, రాజ్యాంగాన్ని అంతం చేయాలనుకునే వారు మరోవైపు ఉన్నారంటూ బీజేపీ కూటమిని విమర్శించారు. తమ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అగ్నివీర్ పథకాన్ని తొలగించి, చెత్తబుట్టలో వేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
TVS Raider 125 Updated: TVS Raider 125 బైక్ కొత్త ఫీచర్లతో అప్డేట్.. ట్రాక్షన్ కంట్రోల్, టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్!
-
Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
-
Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
-
PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
-
Isha Ambani: జియో పుట్టుక వెనుక అసలు కథ.. ఈషా అంబానీ చెప్పిన సీక్రెట్ స్టోరీ!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!