భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై కీలక అడుగులు పడుతున్నట్లుగా తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా వాణిజ్య ఒప్పందంపై రెండు దేశాల మధ్య చర్చలు తర్జన భర్జన జరుగుతున్నాయి. చర్చలు ఫలించకపోవడంతో ఇరు దేశాల మధ్య దూరం నడుస్తోంది.
దేదీప్యమానంగా వెలిగే భోగి మంటలు మీకు కొత్త వెలుగులు తేవాలి.. సీఎం భోగి శుభాకాంక్షలు.. తెలుగు లోగిళ్లు సంక్రాంతి సంబరాలుకు సిద్ధం అవుతున్నాయి.. మూడు రోజుల పాటు జరిగే ఈ పండుగలో.. రేపు అనగా బుధవారం రోజు భోగి పండుగ నిర్వహించనున్నారు.. ఈ సందర్భంగా భోగి శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సంక్రాంతి ముగ్గులతో అలరారుతున్న తెలుగు లోగిళ్లలో భోగి పండుగ జరుపుకుంటున్న తెలుగు ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని పేర్కొన్న…
సౌదీ అరేబియాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. భారతీయ వివాహిత మహిళా అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. బాధితురాలు ఉత్తరప్రదేశ్‌లోని లక్నోవాసిగా గుర్తించారు. వరకట్న వేధింపులతో భర్త చంపేశాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు.
డ్రాగన్ దేశం మరోసారి భారతదేశంతో కయ్యానికి దిగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయన్న తరుణంలో మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. షక్స్‌గామ్ వ్యాలీ సరిహద్దు వివాదంతో భారత దేశాన్ని రెచ్చగొడుతోంది. చైనా చర్యలను భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
20 ఏళ్ల వరకు అధికారంలో కూటమి ప్రభుత్వం..! చింతమనేని ఆసక్తికర వ్యాఖ్యలు ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. దెందులూరు నియోజకవర్గంలో సంక్రాంతి వేడుకలు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రాబోయే 20 సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నియోజకవర్గంలోని ఉద్యోగస్తులకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్…
ప్రముఖ డిజిటల్ చెల్లింపుల దిగ్గజం ఫోన్‌పే (PhonePe), ఆన్లైన్ లావాదేవీలను మరింత వేగవంతం చేసే దిశగా కీలక అడుగు వేసింది. తన పేమెంట్ గేట్‌వే ప్లాట్ఫామ్లో వీసా (Visa) , మాస్టర్ కార్డ్ (Mastercard) వినియోగదారుల కోసం ‘PhonePe PG Bolt’ అనే సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నూతన సాంకేతికత ద్వారా కోట్లాది మంది డెబిట్ , క్రెడిట్ కార్డ్ వినియోగదారులు తమ చెల్లింపులను మునుపెన్నడూ లేని విధంగా అత్యంత సులభంగా , భద్రంగా…
వెనిజులా చమురు విక్రయానికి ట్రంప్ పిలుపునిచ్చారు. 50 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును విక్రయించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. శుక్రవారం వైట్‌హౌస్‌లో చమురు కంపెనీ అధిపతులతో ట్రంప్ సమావేశం అయ్యారు.
India Slams Mamdani: న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీపై భారత్ విమర్శలు గుప్పించింది. ఢిల్లీ అల్లర్ల కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఉమర్ ఖలీద్‌కు మద్దతుగా మమ్దానీ లేఖ రాశారు. ఈ కేసులో ప్రస్తుతం, ఖలీద్ జైలులో ఉన్నాడు. ఇటీవల సుప్రీంకోర్టు అతడి బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది. అయితే, మమ్దానీ లేఖపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. మమ్దానీ ఇతర ప్రజాస్వామ్య దేశాల న్యాయవ్యవస్థల పట్ల గౌరంగా ఉండాలని, తనకు అప్పగించిన…
పిఠాపురం కమిషనర్‌పై పవన్ కల్యాణ్ సీరియస్.. నేను చీపురు పట్టి తుడవాలా..? డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన సొంత నియోజకవర్గం కాకినాడ జిల్లా పిఠాపురంలో పర్యటిస్తున్నారు.. అయితే, స్థానిక అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు పవన్.. పిఠాపురం మున్సిపల్ కమిషనర్‌తో పాటు డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, పిఠాపురం కమిషనర్ వ్యవహారశైలిని ఆయన తప్పుబట్టారు. కాలనీల్లో పేరుకుపోయిన చెత్త, అపరిశుభ్ర పరిస్థితులను చూసి పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీలు ఇంత చెత్తగా…
అవకాలు చెవాకులు పేలొద్దు.. జగన్ మాట్లాడితే నోరు తెరుస్తారు..? కూటమి నేతలపై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని.. ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డ ఆయన… పార్టీ కార్యకలాపాల విషయంలో అధికారులు అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. మచిలీపట్నంలో మా పార్టీ సమావేశం పెట్టుకుంటే.. కాగితాలే ఇవ్వలేదని మున్సిపల్ కమిషనర్ చెప్పడం హాస్యాస్పదం. అధికారులు ప్రభుత్వ ఉద్యోగులుగా కాకుండా, పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా పని చేస్తున్నారు అంటూ…