Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు నమోదైంది. ఆసియా కప్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో ఆసియా కప్ చరిత్రలో వన్డే ఫార్మాట్, టీ20 ఫార్మాట్లలో సున్నా పరుగులకే అవుటైన తొలి ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో నాలుగు బంతులు ఆడిన కోహ్లీ మధుశంక బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. గత రెండు మ్యాచ్‌లలో కోహ్లీ హాఫ్ సెంచరీలు చేసి ఊపు…
IND Vs SL: ఆసియా కప్‌లో శ్రీలంకపై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ తడబడింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాలో కెప్టెన్ రోహిత్ శర్మ(72), సూర్యకుమార్(34) మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. దీంతో శ్రీలంక ముందు 174 పరుగుల లక్ష్యం నిలిచింది. శ్రీలంక బౌలర్లు అద్భుతమైన యార్కర్లతో భారత బ్యాటర్లను ఔట్ చేశారు. లంక బౌలర్లలో మధుశంక 3,…
Asia Cup 2022: టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్ పాకిస్థాన్ గెలుస్తుందంటూ సెహ్వాగ్ జోస్యం చెప్పడంతో పలువురు నెటిజన్‌లు మండిపడుతున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. మంగళవారం నాడు శ్రీలంకతో టీమిండియా కీలక మ్యాచ్ ఆడబోతోంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడితే దాయాది పాకిస్థాన్ ఆసియా కప్ ఎగరేసుకుపోతుందని సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. ఇటీవల టీమిండియాపై పాకిస్థాన్ విజయం సాధించిన వైనాన్ని బట్టి చూస్తే దాయాది పాకిస్థాన్ ఛాంపియన్‌గా నిలిచే అవకాశాలు…
శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా మహిళలు 2-0 తేడాతో కైవసం చేసుకున్నారు. శనివారం దంబుల్లా వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో శ్రీలంకపై భారత్ అలవోకగా గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మేరకు శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఓపెనర్లు విష్మి గుణరత్నే (45), కెప్టెన్ ఆటపట్టు…
శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌కు టీమిండియా మరింత బలోపేతం అయ్యింది. తొలి టెస్టుకు గాయం కారణంగా దూరంగా ఉన్న అక్షర్ పటేల్.. రెండో టెస్టు కోసం జట్టులోకి వచ్చాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకుని తగిన ఫిట్‌నెస్ సాధించిన అక్షర్ పటేల్ ఈ నెల 12 నుంచి శ్రీలంకతో బెంగళూరు వేదికగా జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ వెల్లడించింది. ఈ నేపథ్యంలో అక్షర్ పటేల్ జట్టులోకి రావడంతో కుల్‌దీప్ యాదవ్ టీం నుంచి…
ధర్శశాల వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో టీ-20 మ్యాచ్‌లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది.. శ్రీలంకను వైట్‌వాష్ చేసి మరో సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది రోహిత్ సే.. ఇక, ఈ మ్యాచ్‌తో మరో రికార్డు నెలకొల్పాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ టీ20 కేరిర్‌లో 125 మ్యాచ్‌లు పూర్తి చేశాడు.. దీంతో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.. ఇప్పటి వరకు ఈ రికార్డు…
శ్రీలంకతో జరుగుతున్న మూడో టీ-20 లో టీమిండియా ఓటమిపాలైంది. 7 వికెట్ల తేడాతో భారత్‌పై, శ్రీలంక విజయం సాధించింది. దీంతో 2-1 తేడాతో లంక టీం సీరీస్ కైవసం చేసుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో, 8 వికెట్ల నష్టానికి….81 పరుగులు మాత్రమే చేసింది. స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు వచ్చిన లంక జట్టు 3 వికెట్లు కోల్పోయి….14.3 ఓవర్లోనే టార్గెట్‌ను ఛేజ్ చేసింది. భారత బ్యాటింగ్‌లో కుల్దీప్ యాదవ్, రుతురాజ్…
టీం ఇండియా మరియు శ్రీలంక జట్ల మధ్య కొలంబో వేదికగా ఇవాళ రెండో టీ-20 మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ను కాసేపటి క్రితమే వేశారు. ఈ టాస్ ను నెగ్గిన శ్రీలంక జట్టు… మొదటగా బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్ కు దిగనుంది. జట్ల వివరాలు : శ్రీలంక : అవిష్కా ఫెర్నాండో, మినోద్ భానుకా (ప), ధనంజయ డి సిల్వా, సదీరా…
నేడు భారత్-శ్రీలంక మధ్య జరగాల్సిన టీ20 మ్యాచ్ కు కరోనా ఆటంకం కలిగించింది. శిఖర్ ధావన్ కెప్టెన్సీలో లంకలో పర్యటిస్తున్న యువ భారత జట్టులో ఆల్ కృనాల్ పాండ్యాకు కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో నేటి మ్యాచ్ ను వాయిదా వేశారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈరోజు చేసినా కరోనా పరీక్షలో బీసీసీఐ మెడికల్ బృందం కృనాల్ కరోనా బారిన పడినట్లు అలాగే అతనికి 8 మంది సన్నిహితంగా ఉన్నట్లు గుర్తించింది. దాంతో…
భారత జట్టులో కరోనా కలకలం రేపింది. టీం ఇండియా ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్ గా తేలింది. అయితే కోహ్లీ నేతృత్వంలోని ఓ భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ లో పర్యటిస్తుండగా శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని మరో జట్టు శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్ లో తలపడుతుంది. అయితే ఇప్పటికే వన్డే సిరీస్ ను 2-1 తో ధావన్ సేన సొంతం చేసుకోగా ప్రస్తుతం టీ20 సిరీస్ లో 1-0 తో ఆధిక్యంలో ఉంది.…