శ్రీలంక క్రికెట్ బోర్డుకి ఆ జట్టు ఆటగాళ్లు ఊహించని షాకిచ్చారు. షెడ్యూల్ ప్రకారం లంక జట్టు జులై 13 నుంచి కొలంబో వేదికగా భారత్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. ఈ మేరకు ధవన్ నేతృత్వంలోని భారత జట్టు ఇప్పటికే కొలంబోకి చేరుకుని క్వారంటైన్‌ను కూడా కంప్లీట్ చేసింది. ఈ నేపథ్యంలో శ్రీలంకకి చెందిన ఐదుగురు క్రికెటర్లు.. భారత్‌తో సిరీస్‌కి సంబంధించిన కాంట్రాక్ట్‌పై సంతకం చేసేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. శ్రీలంక క్రికెట్ బోర్డు, ఆ…
త్వరలో శ్రీలంక పర్యటనకు బయలుదేరే టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం ముంబయిలోని ఓ స్టార్ హోటల్‌లో క్వారంటైన్‌లో ఉన్నారు. నేటితో వారికి క్వారంటైన్ గడువు ముగుస్తుంది. ఈ ఆటగాళ్లకు బీసీసీఐ సకల సౌకర్యాలు కల్పించింది. వారికెంతో ఇష్టమైన ‘మాక్‌డక్’ అనే వెజిటేరియన్ రెసిపీని ప్రత్యేకంగా తయారు చేయించింది. అదెలా చేశారనే విషయాన్ని కూడా ఒక వీడియోలో బీసీసీఐ పంచుకుంది. ఈ వీడియోలో ప్రధాన చెఫ్ రాకేశ్ కాంబ్లే తన సిబ్బందిని పరిచయం చేస్తూ వివరంగా ‘మాక్‌డక్’ను ఎలా వండుతారో…
శ్రీలంక క్రికెట్ జట్టు పరిస్థితి దారుణంగా ఉందని మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య అన్నారు. వెంటనే చర్యలు తీసుకొని కాపాడాలని సూచించాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న లంక జట్టు మూడు టీ20ల సిరీస్‌ను ఒక్కటి కూడా గెలవకుండానే ఓటమిపాలైంది. ఈ పర్యటనలో శ్రీలంక ఏ మ్యాచ్‌లోనూ ఇంగ్లాండ్‌కు కనీస పోటీ ఇవ్వలేకపోయింది. మరీ ముఖ్యంగా ఆఖరి మ్యాచ్‌లో ఆ జట్టు 181 పరుగుల లక్ష్య ఛేదనలో 91 పరుగులకే కుప్పకూలింది. దీంతో జయసూర్య ఇలా స్పందించాడు. మరోవైపు…
శ్రీలంక పర్యటనలో కూడా ప్రతి ఒక్క ఆటగాడికి అవకాశం కల్పిస్తానని చెప్పిన ద్రవిడ్.. ఇప్పుడేమో అందరికీ అవకాశం ఇవ్వడం సాధ్యపడదని అంటున్నాడు. జట్టుకు ఎంపికై బెంచ్‌కే పరిమితం కావడం చాలా బాధిస్తుందని, ఆ బాధలను తాను కూడా అనుభవించానని చెప్పిన ఆయన..ఇప్పుడా మాటను దాట వేసినట్లుగా మాట్లాడాడు. కేవలం ఆరు మ్యాచ్‌ల లంక పర్యటనలో అందరికీ అవకాశం వస్తుందనుకోవడం సరికాదని, ఎవరికి అవకాశం ఇవ్వాలనేది సెలక్టర్లు చూసుకుంటారని వ్యాఖ్యానించాడు. తుది జట్టు ఎంపిక సెలక్టర్లు, మేనేజ్‌మెంట్ పరిధిలోని…
ప్రస్తుతం కోహ్లీ కెప్టెన్సీలోని ఓ భారత జట్టు ఇంగ్లాండ్ లో ఉండగా శిఖర్ ధావన్ కెప్టెన్సీలో మరో భారత జట్టు శ్రీలంకకు వెళ్తుంది. అందుకోసం ఆ జట్టు రేపటి నుండి క్వారంటైన్ లోకి వెళ్లనుంది. 14 నుంచి 28వ తేదీ వరకు ఆటగాలందరు ముంబైలోని ఓ హోటల్లో క్వారంటైన్‌లో ఉంటారు. ఈ 14 రోజుల్లో ఆటగాళ్లకు ఆరుసార్లు కరోనా పరీక్షలు నిర్వహించగా… అందులో నెగెటివ్ వచ్చినవారు బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో లంకకు వెళ్తారు. అక్కడికి…
శ్రీలంకలో పర్యటించే భారత జట్టుకు రాహుల్ ద్రావిడ్ కోచ్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో శిఖర్ ధావన్ కెప్టెన్సీలో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు 20మంది ఆటగాళ్లతో కూసిన జట్టును ఎంపిక చేసింది. అయితే ఈ పర్యటన పై తాజాగా రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ… నేను ‘భారత్-ఏ, అండర్-19 కోచ్‌గా ఉన్నప్పుడు జట్టుకు ఎంపికైన ఆటగాళ్లందరికీ అవకాశం ఇస్తానని ముందే చెప్పేవాడిని. మ్యాచుల్లో అవకాశం దొరక్కపోతే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు బెంచ్…
శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్టుకు శిఖర్ ధావన్‌ను కెప్టెన్‌గా, భువనేశ్వర్ కుమార్‌ను వైస్ కెప్టెన్‌గా ప్రకటించింది. అయితే బీసీసీఐ తనను టీమిండియా కెప్టెన్‌గా నియమించడం పై సోషల్ మీడియా వేదికగా శిఖర్ ధావన్ స్పందించాడు. తన ట్విట్టర్ లో “దేశానికి నాయకత్వం వహించడం గొప్పగా భావిస్తున్నా. మీ అందరి విషెస్‌కు ధన్యవాదాలు” అని ధావన్ ట్వీట్ చేశాడు. అయితే ధావన్ మొదటి సారి జట్టును నడిపించబోతున్నాడు.…
ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడేందుకు భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇదే సయమంలో మరో భారత జట్టు శ్రీలంకలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ వెలువడింది. జులై 5 న లంకకు బయలుదేరనున్న భారత్ బి జట్టు జట్లు మూడు వన్డేలు, మూడు టీ20 ల్లో పోటీ పడనున్నాయి. ఇందులో జులై 13న మొదటి వన్డే మ్యాచ్ అలాగే వరుసగా 16,18 న రెండు,…
భారత జట్లలో కోహ్లీ సారధ్యంలోని ఒక్క జట్టు టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ అలాగే ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తుండగా.. మరో జట్టు శ్రీలంక పర్యటనలకు వెళ్లనున్న విషయం తెలిసిందే. అయితే గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన శ్రీలంక పర్యటనను బీసీసీఐ ఇప్పుడు ప్లాన్ చేసింది. శ్రీలంక పర్యటనలో భారత్ జులై 13 నుంచి 27 వరకూ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. అయితే లంకకు వెళ్లే జట్టుకు కెప్టెన్ రేసులో మొదటగా శిఖర్ ధావన్, హార్దిక్…