ధర్శశాల వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో టీ-20 మ్యాచ్‌లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది.. శ్రీలంకను వైట్‌వాష్ చేసి మరో సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది రోహిత్ సే.. ఇక, ఈ మ్యాచ్‌తో మరో రికార్డు నెలకొల్పాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ టీ20 కేరిర్‌లో 125 మ్యాచ్‌లు పూర్తి చేశాడు.. దీంతో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.. ఇప్పటి వరకు ఈ రికార్డు పాకిస్థాన్ తరపున 124 టీ20 మ్యాచ్‌లు ఆడి షోయాబ్ మాలిక్ పేరిట ఉండగా… 125 మ్యాచ్‌లతో మాలిక్‌ను వెనక్కి నెట్టేశాడు రోహిత్.. ఈ లిస్ట్‌లో 124 మ్యాచ్‌లతో మాలిక్ రెండో స్ధానంలో.. 119 మ్యాచ్‌లతో మహ్మద్ హఫీజ్ మూడో ప్లేస్‌లో ఉన్నారు.. ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (115), బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మదుల్లా (113).. పాకిస్థాన్ ద్వయం తర్వాత వరుసగా నాల్గు, ఐదో స్థానాల్లో ఉన్నారు.
Read Also: COVID 19: భారీగా తగ్గిన కొత్త కేసులు.. 10 వేల దిగువకు..
మరోవైపు.. 100కు పైగా టీ20లు ఆడిన భారత ఏకైక ఆటగాడు కూడా రోహిత్ శర్మే కావడం మరో విశేషం. భారత్ నుంచి అత్యధిక టీ-20 మ్యాచ్‌లు ఆడిన వారి జాబితాను పరిశీస్తే.. 125 మ్యాచ్‌లతో (ప్రపంచంలోనే నంబర్ వన్) టాప్‌స్పాట్‌లో రోహిత్ శర్మ వంటే.. ఆ తర్వాత 98 మ్యాచ్‌లతో ఎంస్ ధోరీ, 97 మ్యాచ్‌లతో విరాట్ కోహ్లి ఉన్నారు.. నవంబర్‌లో భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన రోహిత్ శర్మ.. ఆ తర్వాత పూర్తి స్థాయి నాయకత్వ పాత్రను చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా కోల్పోయింది లేదు.. ప్రస్తుతం టీ20 సిరీస్‌లో శ్రీలంకను 3-0తో వైట్‌వాష్ చేశాడు.. స్వదేశీ సిరీస్‌లో అంతకుముందు న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్లను కూడా వైట్ వాష్ చేసిన విషయం తెలిసిందే.