India vs Pakistan: వన్డే ప్రపంచకప్ 2023.. భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ రీ-షెడ్యూల్! కారణం ఏంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs PAK ODI World Cup 2023 Match Likely To Be Rescheduled As Navratri: వన్డే ప్రపంచకప్ 2023 భారత గడ్డపై జరగనున్న విషయం తెలిసిందే. 2011 తర్వాత భారత్‌లో వన్డే ప్రపంచకప్ జరగడం ఇదే తొలిసారి. మెగా ఈవెంట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ రిలీజ్ చేసింది. ఆక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ప్రపంచకప్ మ్యాచులు జరగనున్నాయి. ఆక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ మ్యాచ్‌తో మెగా టోర్నీ ప్రారంభం కానుంది. అక్టోబర్ 8న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియాతో భారత్ తన తొలి మ్యాచ్ ఆడుతుంది.
క్రికెట్ అభిమానుల ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. అయితే ఈ మ్యాచ్ రీ-షెడ్యూల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది. ఇండో-పాక్ మ్యాచ్ రోజునే నవరాత్రి ఉత్సవాల మొదటి రోజు. నవరాత్రి తొలి రోజు ఉత్సవాలు మరియు వేడుకలను దృష్టిలో ఉంచుకుని ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ షెడ్యూల్‌ను మళ్లీ రూపొందించాలని భద్రతా సంస్థలు బీసీసీఐని కోరాయట. పండగ, మ్యాచ్ సందర్భంగా వేలాది మంది అహ్మదాబాద్ చేరుకుంటారని.. సెక్యూరిటీ కష్టమవుతుందని భద్రతా ఏజెన్సీలు పేర్కొంటున్నాయట. గుజరాత్లో నవరాత్రి ఉత్సవాలను గ్రాండ్‌గా నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే.
Also Read
- Rob Walter: రెండు మ్యాచ్‌లలో గెలిచేవాళ్లం.. ఈ ఒక్క కారణంతోనే ఓడిపోయాం.. కివీస్ హెడ్ కోచ్ ఆవేదన..
- Home Minister Anitha: ఈ ఐదు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. హోంమంత్రి కీలక సూచనలు
- Europe Protest: అట్టుడుకుతున్న యూరప్.. ప్రభుత్వాలపై ఆగ్రహజ్వాలలు..
- SBI Account Holders: ఎస్బీఐ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకపోతే అకౌంట్ బ్లాక్..
Also Read: Road Accident: రాఖీల కోసం వెళ్లి.. మృత్యు ఒడిలోకి చేరిన బాబాయ్, అమ్మాయి!
భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌పై ఉన్న అన్ని ఎంపికలను పరిశీలిస్తున్నామని, త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఓ బీసీసీఐ అధికారి చెప్పినట్లు సమాచారం. వన్డే ప్రపంచకప్ 2023 మ్యాచ్‌లు నిర్వహించే అన్ని రాష్ట్ర సంఘాలను జూలై 27న జరిగే సమావేశానికి హాజరు కావాలని బీసీసీఐ కార్యదర్శి జే షా కోరారు. ఈ సమావేశంలో ఇండో-పాక్ మ్యాచ్‌పై ఓ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అయితే ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం టికెట్స్, హోటళ్లు, లాడ్జ్ బుక్ చేసుకున్నారు. ఇప్పుడు మ్యాచ్ తేదీ మారితే.. ఆ ప్రభావం చాలా మంది అభిమానులపై పడనుంది. చాలా వరకు లాజిస్టిక్ సమస్యలు ఎదురుకానున్నాయి. మరి బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
ప్రపంచకప్ 2023లో 45 గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు, 2 నాకౌట్ మ్యాచ్‌లు (సెమీ ఫైనల్స్), ఒక ఫైనల్ మ్యాచ్ జరగనున్నాయి. మొత్తం 48 మ్యాచ్‌లకు భారత్‌లోని 10 నగరాలు ఆతిథ్యమివ్వనున్నాయి. ఢిల్లీ, లక్నో, పుణె, ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా హైదరాబాద్, ధర్మశాల వేదికలుగా మ్యాచ్‌లు జరగనున్నాయి. రౌండ్ రాబిన్ ఫార్మాట్లో జరగనున్న ప్రపంచకప్ 2023లో మొత్తం 10 జట్లు తలపడనున్నాయి.
Also Read: Harmanpreet Kaur Suspended : టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై నిషేధం!
India vs Pakistan match in World Cup is likely to be rescheduled due to the first day of Navaratri. [The Indian Express] pic.twitter.com/fhaStxdeNE
— Johns. (@CricCrazyJohns) July 26, 2023
తాజావార్తలు
-
Rob Walter: రెండు మ్యాచ్‌లలో గెలిచేవాళ్లం.. ఈ ఒక్క కారణంతోనే ఓడిపోయాం.. కివీస్ హెడ్ కోచ్ ఆవేదన..
-
Mann Ki Baat: ‘వోకల్ ఫర్ లోకల్’తో ప్రపంచ మార్కెట్లలోకి భారత ఉత్పత్తులు!.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
-
Home Minister Anitha: ఈ ఐదు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. హోంమంత్రి కీలక సూచనలు
-
Europe Protest: అట్టుడుకుతున్న యూరప్.. ప్రభుత్వాలపై ఆగ్రహజ్వాలలు..
-
France Protests Turn Violent: ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనలు.. లక్షలాది మంది ప్రజలు ఎందుకు రోడ్డెక్కారు?.. మాక్రాన్ ఏం చెప్పారు?
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!