Asia Cup 2023 Schedule: ఆసియా కప్ 2023 షెడ్యూల్.. సెప్టెంబర్ 2న భారత్-పాకిస్తాన్ మ్యాచ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Pakistan Match Likely On September 2 in Asia Cup 2023: హైబ్రిడ్ మోడల్‌లో జరగనున్న పురుషుల ఆసియా కప్ 2023 షెడ్యూల్ బుధవారం (జూలై 19) విడుదల కానుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) కొత్త చైర్మన్ జాకా అష్రఫ్ బుధవారం రాత్రి 7.45కి లాహోర్‌లో అధికారిక షెడ్యూల్‌ను ప్రకటిస్తారు అని పీసీబీ పేర్కొంది. ఈ టోర్నమెంట్ ఆగష్టు 31న లాహోర్‌లో ప్రారంభమవుతుందని సమాచారం. సెప్టెంబర్ 2న చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుందని తెలుస్తోంది.
ఆసియా కప్ 2023 షెడ్యూల్ ( Asia Cup 2023 Schedule) జులై 15న ఖరారు అయినా.. టోర్నీ ఏర్పాట్లు మరియు మార్కెటింగ్ ప్రచారాలకు సంబంధించి పీసీబీ మరియు ఏసీసీ అధికారుల మధ్య సమావేశం కారణంగా నేడు రిలీజ్ చేస్తున్నారట. భారత్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల మధ్య ఎన్నో గొడవల తర్వాత ఆసియా కప్ 2023 నిర్వహణకు అన్ని మార్గాలు క్లియర్ అయ్యాయి.
Also Read
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
- India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- Rain Alert: ఏపీ వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
Also Read: Funny Cricket Video: బంతి ఇవ్వనన్న బ్యాటర్.. వెంటపడిన కీపర్! వీడేమో చూస్తే అస్సలు నవ్వాగదు
హైబ్రీడ్ మోడల్‌లో జరగనున్న ఆసియా కప్ 2023లో 13 మ్యాచ్‌లు ఉంటాయి. ఈ 13 మ్యాచ్‌లకు పాకిస్తాన్, శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనున్నాయి. పాక్‌లో 4, శ్రీలంకలో 9 మ్యాచ్‌లు జరగనున్నాయి. పాక్‌లో నాలుగు మ్యాచ్‌ల అనంతరం.. టోర్నీ శ్రీలంకకు తరలిపోతోంది. శ్రీలంకలోనే భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఉంటుంది. 2023 ఆసియా కప్‌కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే పాకిస్తాన్‌లో పర్యటించేందుకు భారత్ సుముఖత వ్యక్తం చేయకపోవడంతో తటస్థ వేదికపై మ్యాచ్‌లు జరుగనున్నాయి.
అంచనాల ప్రకారం ఆగస్టు 31న ప్రారంభమయ్యే 2023 ఆసియా కప్.. సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్‌తో పాటు నేపాల్ కూడా ఈ టోర్నీలో ఆడబోతోంది. ఈ ఎడిషన్‌లో మూడేసి జట్లుగా రెండు గ్రూప్‌లుగా తొలి రౌండ్ మ్యాచులు ఆడుతాయి. ఆపై సూపర్ 4 రౌండ్‌లో టాప్‌లో నిలిచిన రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
Also Read: Kohli-Sachin: అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు.. సచిన్ రికార్డు సమం చేసిన విరాట్ కోహ్లీ!
తాజావార్తలు
-
B35 Bullet Train: 2030 నాటికి భారత్ 350KM వేగంతో బుల్లెట్ ట్రైన్.. జపాన్ E10 సిరీస్‌కు పోటీగా స్వదేశీ B35
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!