BCCI Secretary Jay Shah Says ODI World Cup 2023 Matches Rescheduled: వన్డే ప్రపంచకప్ 2023లోని భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌పై గత 2-3 రోజలుగా వస్తున్న ఊహాగానాలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెక్రటరీ జే షా చెక్ పెట్టారు. ఇండో-పాక్ మ్యాచ్ మ్యాచ్ తేదీని మార్చుతామని, రెండు రోజులలో తేదీ ప్రకటిస్తామని హింట్ ఇచ్చారు. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ మాత్రమే కాదు.. ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌లోనూ మార్పు ఉంటుందని చెప్పారు. గురువారం (జులై 27) జరిగిన సమావేశం అనంతరం బీసీసీఐ సెక్రటరీ జై షా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రకటన చేశారు.
భారత గడ్డపై జరగనున్న వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌ను ఐసీసీ రిలీజ్ చేసింది. ఆక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ప్రపంచకప్ మ్యాచులు జరగనున్నాయి. అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్థాన్‌ల మధ్య మ్యాచ్ ఉంది. అక్టోబర్ 15 నుంచి భారత్‌లో నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. దాంతో భద్రతా కారణాల దృష్ట్యా మ్యాచ్ తేదీని మార్చాలని భారత భద్రతా సంస్థలు బీసీసీఐకి సూచించాయి. అందుకే జులై 27న సమావేశాన్ని ఏర్పాటు చేసిన బీసీసీఐ సెక్రటరీ జై షా.. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారట.
భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పైనే కాకుండా ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌లో మరికొన్ని మ్యాచ్‌ల తేదీలను కూడా మార్చాలని బీసీసీఐ సమావేశంలో నిర్ణయించారు. కొత్త షెడ్యూల్ (ODI World Cup 2023 New Schedule) 2-3 రోజుల్లో విడుదల అయ్యే అవకాశం ఉందట. ప్రపంచకప్ షెడ్యూల్ మార్చాలని మూడు సభ్య దేశాలు ఐసీసీని అభ్యర్థించాయట. దాంతో 3 నుంచి 4 మ్యాచ్‌ల షెడ్యూల్ మారే అవకాశం ఉంది. మ్యాచ్ వేదికలో ఎలాంటి మార్పు లేకున్నా.. తేదీ మాత్రమే మారుతుందట.
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుండగా.. తేదీపై కచ్చితమైన సమాచారం లేదు. అయితే ఒకరోజు ముందుగా ఆక్టోబర్ 14 ఈ మ్యాచ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచకప్ 2023కి సంబందించిన టికెట్స్ త్వరలోనే ఓపెన్ అవుతాయట. మ్యాచ్‌లను చూసేందుకు వచ్చే ప్రేక్షకులకు ఉచితంగా తాగే నీరు ఇవ్వాలని బీసీసీఐ చూస్తోందట. ప్రపంచకప్ 2023 గురించి కాకుండా.. జస్ప్రీత్ బుమ్రా, హర్మన్ ప్రీత్ కౌర్, భారత్ ఏ vs దక్షిణాఫ్రికా ఏ సిరీస్ గురించి కూడా ప్రస్తావించినట్టు తెలుస్తోంది.
Also Read: Ravindra Jadeja Recod: చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా.. తొలి భారత బౌలర్‌గా అరుదైన రికార్డు!