న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 99 పరుగుల వద్ద భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ఔటయ్యాడు. దీంతో.. సెంచరీని మిస్ చేసుకున్నాడు. గత ఆరేళ్లలో పంత్ టెస్టుల్లో ఏడోసారి 90-99 రన్స్ మధ్య ఔటయ్యాడు. నాలుగో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన పంత్.. సర్ఫరాజ్ ఖాన్ తో కలిసి నాలుగో వికెట్ కు అద్భుత భాగస్వామ్యం నెలకొల్పి భారత్ ను కష్టాల నుంచి గట్టెక్కించాడు.
న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా అద్భుతంగా రాణించింది. కాగా.. 462 పరుగులకు భారత్ ఆలౌటైంది. ఈరోజు 3 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ ప్రారంభించిన సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ అద్భుతంగా ఆడారు. దీంతో.. భారత్ 107 పరుగుల ఆధిక్యంలోకి వచ్చింది. సర్ఫరాజ్ ఖాన్ (150), పంత్ (99) పరుగులతో సూపర్ ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరూ నిలకడగా ఆడి పరుగుల పట్టికను పరుగులు పెట్టించారు.
సెంచరీ సాధిస్తాడని అనుకున్న రిషబ్ పంత్ జస్ట్‌లో మిస్ అయింది. 99 పరుగుల వద్ద ఔటై అభిమానులను నిరాశపరిచాడు. 105 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో రాణించాడు. అంతకుముందు.. 150 పరుగులు చేసి ఔటైన సర్ఫరాజ్ ఖాన్ కూడా.. డబుల్ సెంచరీ సాధిస్తాడని అనుకున్నారు. కానీ అతను కూడా 150 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఏదేమైనప్పటికీ భారత్ రెండో ఇన్నింగ్స్‌లో అందరూ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు.
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య శనివారం జరిగిన తొలి టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ అద్భుత సెంచరీ సాధించాడు. నాలుగో రోజు బెంగళూరు స్టేడియంలో 110 బంతుల్లో తొలి అంతర్జాతీయ సెంచరీని పూర్తి చేశాడు. క్లిష్ట పరిస్థితుల్లో మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు దిగిన సర్ఫరాజ్.. అద్భుత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. ఈ క్రమంలో సెంచరీతో రాణించిన సర్ఫరాజ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Sarfaraz Khan Stopping Rishab Pant to not take Run: బెంగళూరు వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టుకు మళ్లీ వర్షం అడ్డంకిగా మారింది. నాలుగో రోజైన శనివారం తొలి సెషన్ చివరలో వర్షం రావడంతో.. అంపైర్లు ఆటను నిలిపివేసి లంచ్ విరామాన్ని ప్రకటించారు. ఆట నిలిచే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 3 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. ఇంకా 12 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజులో సర్ఫరాజ్ ఖాన్…
Rain in Bengaluru Chinnaswamy Stadium: బెంగళూరు వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ వర్షం కారణంగా నిలిచిపోయింది. భారత్ ఇన్నింగ్స్ 71 ఓవర్ ముగిసిన అనంతరం చిరు జల్లు రావడంతో మ్యాచ్ నిలిచిపోయింది. అంపైర్లు లంచ్ బ్రేక్ ప్రకటించారు. ప్రస్తుతం చిన్నస్వామి స్టేడియంలో చినుకులు పడుతున్నాయి. ఒకవేళ వాతావరణం అనుకూలిస్తే.. మధ్యాహ్నం 12 గంటకు మ్యాచ్ తిరిగి ఆరంభం కానుంది. Also Read: Gold Rate Today: మగువలకు బ్యాడ్‌న్యూస్..…
Maiden Test Hundred for Sarfaraz Khan: బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 110 బంతుల్లోనే శతకం బాదాడు. టీమ్ సౌథీ వేసిన 57వ ఓవర్ మూడో బంతికి బౌండరీ బాదిన సర్ఫరాజ్.. కెరీర్లో తొలి సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. తొలి అంతర్జాతీయ సెంచరీ కావడంతో సర్ఫరాజ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మైదానంలో పరుగెత్తుతూ సంబరాలు చేసుకున్నాడు. ఇందుకు సంబందించిన వీడియోస్…
Team India Hit 100 Sixes in a Test Calendar Year: టెస్ట్ క్రికెట్లో భారత జట్టు చరిత్ర సృష్టించింది. టెస్ట్ ఫార్మాట్లో ఒకే క్యాలెండర్ ఇయర్లో 100 సిక్స్‌లు బాదిన మొదటి జట్టుగా భారత్ రెకార్డుల్లోకెక్కింది. బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత్ ఈ ఫీట్ సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆజాజ్ పటేల్ బౌలింగ్‌లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సిక్సర్ బాదడంతో టీమిండియా 100 సిక్స్‌ల మైలురాయిని చేరుకుంది. 147…
బెంగళూరు వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఫలితం రావడం ఖాయంగా కనిపిస్తోంది. 356 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. మూడోరోజు ఆట ముగిసేసరికి 231/3 స్కోరుతో నిలిచింది. రోహిత్ సేన ఇంకా 125 పరుగులు వెనుకబడి ఉంది. ఆట చివరి బంతికి విరాట్ కోహ్లీ (70) అవుట్ కాగా.. క్రీజ్‌లో సర్ఫరాజ్ ఖాన్ (70) ఉన్నాడు. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్ బ్యాటింగ్…
Rishabh Pant Batting Today in Bengaluru: బెంగళూరు టెస్టులో నేడు నాలుగో రోజు. మూడో రోజైన శుక్రవారం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్ 231/3 స్కోర్ చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో విఫలమైన రోహిత్ శర్మ (52; 63 బంతుల్లో 8×4, 1×6), విరాట్ కోహ్లీ (70; 102 బంతుల్లో 8×4, 1×6), సర్ఫరాజ్ ఖాన్ (70 బ్యాటింగ్; 78 బంతుల్లో 7×4, 3×6)లు జట్టును ఆదుకున్నారు. మూడో రోజు ఆటలో చివరి బంతికి కోహ్లీ అవుటయ్యాడు.…