IND vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ కోసం భారత జట్టు సమాయత్తం అవుతోంది. 3 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ఆదివారం ( జనవరి 11న) తొలి వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ప్రాక్టీస్‌లో నిమగ్నం అయ్యారు. శుక్రవారం జరిగిన సెషన్‌లో కోహ్లీ, రోహిత్ మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించారు. నెట్స్‌లో వీరిద్దరూ గంటన్నర సేపు పేసర్లు, స్పిన్నర్లను సమర్ధంగా ఎదుర్కొన్నారు. ఆ తర్వాత త్రోడౌన్ స్పెషలిస్ట్ బంతులతో ప్రాక్టీస్ కొనసాగించారు.
Read Also: Kartik Aaryan : హోటల్ రూమ్‌లో అడ్డంగా దొరికిపోయిన కార్తీక్ ఆర్యన్.. స్పందించిన కరీనా !
అయితే, టీ20, టెస్టు ఫార్మాట్‌లకు వీడ్కోలు చెప్పిన ఈ ఇద్దరూ… ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే ఇండియన్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో రెండు సెంచరీలు కొట్టిన కింగ్ కోహ్లీ న్యూజిలాండ్‌పై కూడా అదే జోరు కొనసాగించాలని ప్లాన్ చేస్తున్నాడు. దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో వీరిద్దరూ చెరో రెండు మ్యాచ్‌లు ఆడి తమ ఫామ్‌ను చాటుకున్నారు. ఇక, భారత జట్టు కెప్టెన్ శుభ్ మన్ గిల్ కూడా నెట్స్‌లో తీవ్రంగా చెమటోడుస్తున్నారు. అలాగే, గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో చివరి రెండు టీ20లకు దూరమైన గిల్.. ఇప్పుడు పూర్తిగా కోలుకొని ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇక, గురువారం నాడు తమ రాష్ట్ర జట్ల తరఫున విజయ్ హజారే మ్యాచ్‌లు ఆడిన శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, మహమ్మద్ సిరాజ్ శుక్రవారం ప్రాక్టీస్‌లో పాలల్గొనలేదు. వన్డే సిరీస్ అనంతరం న్యూజిలాండ్‌తో టీమిండియా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కూడా ఆడబోతుంది. ఆ వెంటనే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ జరగనుంది. కాగా, గతంలో భారత పర్యటను వచ్చిన న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా ఓడిన భారత జట్టు ఈసారైనా సిరీస్ గెలుస్తుందా అని క్రికెట్ అభిమానులు అనమానం వ్యక్తం చేస్తున్నారు.
New year, fresh start 💪
📸 Glimpses from #TeamIndia's first training session in Vadodara ahead of the #INDvNZ ODIs 👌@IDFCFIRSTBank pic.twitter.com/itTwA5fKDF
— BCCI (@BCCI) January 9, 2026