పుణె టెస్టులో భారత జట్టును ఓడించి న్యూజిలాండ్ చరిత్ర సృష్టించింది. భారత్‌లో కివీస్ జట్టు తొలిసారి టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. 12 ఏళ్లలో 18 సిరీస్‌ల తర్వాత భారత్ సొంతగడ్డపై టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. బెంగళూరు టెస్టులో ఓడిపోయిన భారత్.. స్పిన్ ట్రాక్ పైనే ఆడాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం టీమిండియాకి ఎంతో నష్టాన్ని మిగిల్చింది. మిచెల్ సాంట్నర్ లాంటి స్పిన్నర్ల ముందు భారత బ్యాటర్లు చేతులెత్తేశారు.
IND vs NZ: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ చాలా రసవత్తంగా కొనసాగుతుంది. ఈ మ్యాచ్ లో రెండో ఇన్సింగ్స్ లో కివీస్ ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో 259 రన్స్ చేసిన న్యూజిలాండ్.. రెండు ఇన్నింగ్స్ లో 255 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా విజయానికి 359 పరుగులు చేయాల్సి ఉంది.
పుణే టెస్టులోనూ టీమిండియాకు కష్టాలు తప్పలేదు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 156 పరుగులకే కుప్పకూలగా... రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన న్యూజిలాండ్ భారీ ఆధిక్యంపై కన్నేసింది. కాగా.. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ రెండో ఇన్సింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. దీంతో.. భారత్‌పై న్యూజిలాండ్ 301 పరుగుల ఆధిక్యం సాధించింది.
పూణే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్ల నష్టానికి 107 పరుగులే చేసింది. కివీస్ స్పిన్నర్స్ మిచెల్ శాంట్నర్ (4/36), గ్లెన్ ఫిలిప్స్ (2/26) దెబ్బకు టీమిండియా మొదటి సెషన్లో ఏకంగా ఆరు వికెట్స్ కోల్పోయింది. క్రీజ్‌లో రవీంద్ర జడేజా (11), వాషింగ్టన్ సుందర్ (2) ఉన్నారు. ఇక జట్టును ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ఇదరిపైనే ఉంది. భారత్…
పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు రాణించారు. న్యూజిలాండ్‌ను మొదటి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకే ఆలౌట్ చేశారు. టెస్ట్ మొదటిరోజు చివరి సెషన్లో భారత్ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ (0) వికెట్‌ను త్వరగానే కోల్పోయింది. తొలి టెస్టు మాదిరిగా కాకుండా.. ఈసారి భారీగా పరుగులు చేస్తేనే విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. బౌలర్ల కష్టానికి తగ్గ ప్రతిఫలం అందించాలంటే.. బ్యాటర్లు బాధ్యతాయుతంగా ఆడాల్సి ఉంది. భారత్ ఆధిపత్యం ప్రదర్శించేందుకు…
పూణే వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 16/1 పరుగులతో ఉంది. క్రీజులో యశస్వీ జైస్వాల్ (6*), శుభ్‌మన్ గిల్ (10*) ఉన్నారు. కాగా.. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 243 పరుగుల ఆధిక్యంలో ఉంది.
పూణే వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టు జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసింది. కాగా.. 259 పరుగులకు కివీస్ ఆలౌటైంది. భారత్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ అత్యధికంగా 7 వికెట్లు తీసి.. న్యూజిలాండ్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు.
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా యాష్ రికార్డుల్లోకెక్కాడు. పూణే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో అశ్విన్ రెండు వికెట్స్ పడగొట్టడంతో ఈ రికార్డు సొంతమైంది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అశ్విన్.. ఇప్పటి వరకు డబ్ల్యూటీసీ మ్యాచుల్లో 188 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ జాబితాలో ఇప్పటి వరకు తొలి…