రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ప్రస్తుతం బెంగళూరులో న్యూజిలాండ్‌తో 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఆడుతోంది. భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకు ఆలౌట్ అయింది.
India Lowest Test Score on Home Soil: స్వదేశంలో తిరుగులేని భారత్‌కు న్యూజిలాండ్ భారీ షాక్ ఇచ్చింది. బెంగళూరు వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 31.2 ఓవర్లలోనే 46 పరుగులకే ఆలౌట్ చేసింది. కివీస్ బౌలర్ల దెబ్బకు ఐదుగురు భారత బ్యాటర్లు డకౌట్ కావడం గమనార్హం. రిషబ్ పంత్ (20), యశస్వి జైస్వాల్ (13) మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేశారు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 5 వికెట్లు, ఓరౌర్కీ నాలుగు…
న్యూజిలాండ్ బౌలర్ల దెబ్బకు భారత బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. మొదటి టెస్టు రెండోరోజు ఆటలో లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 34 పరుగులు చేసింది. బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై కివీస్ బౌలర్లు చెలరేగడంతో టీమిండియా స్టార్ బ్యాటర్లు కుదేలయ్యారు. రోహిత్ శర్మ (2) ఖాతా తెరవగా.. విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు డకౌట్ అయ్యారు. ప్రస్తుతం భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. రిషబ్ పంత్ ఆడుకుంటేనే భారత్ కోలుకుంటుంది.…
Virat Kohli Duck in IND vs NZ 1st Test: బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. 9 బంతులు ఎదుర్కొన్న విరాట్.. పరుగుల ఖాతానే తెరవలేదు. విలియమ్ ఓరూర్కీ బౌలింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్ క్యాచ్ పట్టడంతో కింగ్ పెవిలియన్‌కు చేరాడు. కోహ్లీ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘కోహ్లీ పెద్ద గుడ్డు పెట్టాడు’ అంటూ నెటిజన్స్…
India vs New Zealand 1st Test Playing 11: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య మరికొద్ది నిమిషాల్లో తొలి టెస్టు ఆరంభం కానుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బంగ్లాదేశ్‌తో ఆడిన జట్టులో రెండు మార్పులు చేసినట్లు రోహిత్ తెలిపాడు. బ్యాటర్ శుభ్‌మన్ గిల్, పేసర్ ఆకాష్ దీప్‌లు బెంగళూరు టెస్టులో ఆడడం లేదు. భారత్ ఇద్దరు సీమర్లతో బరిలోకి దిగుతుండగా.. కివీస్ ముగ్గురు పేసర్లతో బరిలోకి…
IND vs NZ 1st Test Session Timings: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి టెస్టుకు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. బెంగళూరులో భారీ వర్షం కురవడంతో తొలి రోజైన బుధవారం ఆట సాధ్యపడలేదు. కనీసం టాస్ వేయడానికి కూడా అవకాశం లేకపోయింది. గురువారం కూడా మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నాయి. దాంతో ఈ రోజైనా ఆట మొదలవుతుందా? లేదా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆక్యూ వెదర్ రిపోర్ట్ ప్రకారం.. ప్రస్తుతం బెంగళూరులో…
భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా.. మొదటి మ్యాచ్ బెంగళూరులో జరుగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈరోజు భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగాల్సి ఉంది. కాగా.. వర్షం కారణంగా తొలి టెస్టులో మొదటి రోజు ఆట రద్దయింది. టాస్ పడకుండానే ఆట రద్దు అయింది.
IND vs NZ Pitch and Weather Conditions: స్వదేశంలో మరో టెస్టు సిరీస్ లక్ష్యంగా భారత్ పోరుకు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో తొలి టెస్టు నేటి నుంచే ఆరంభం కానుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తోన్న భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్లో చోటుపై కన్నేసిన రోహిత్ సేన.. సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు శ్రీలంక చేతిలో ఓడిన న్యూజిలాండ్.. జోరుమీదున్న టీమిండియాను ఏ…
బుధవారం నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న తొలి టెస్ట్ తుది జట్టుపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. బెంగళూరులో వర్షం పడుతోందని, పరిస్థితులను బట్టి తుది జట్టును ఎంపిక చేస్తామని చెప్పాడు. జట్టులో ఇద్దరు స్పిన్నర్లు కచ్చితంగా ఉంటారని, పరిస్థితులను బట్టి మూడో స్పిన్నర్‌ను తీసుకోవాలా? వద్దా? అనే విషయం ఆలోచిస్తామని రోహిత్ తెలిపాడు. మంగళవారం ప్రీమ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న హిట్‌మ్యాన్ పలు విషయాలపై స్పందించాడు. ‘బెంగళూరులో వర్షం…
Virat Kohli Nine Thousand Test Runs Record: సొంతగడ్డపై బంగ్లాదేశ్‌ను టెస్టు, టీ20 ఫార్మాట్లో క్లీన్‌స్వీప్ చేసిన భారత్.. స్వదేశంలో మరో టెస్టు సిరీస్‌కు సిద్ధమైంది. బుధవారం (అక్టోబర్ 16) నుంచి న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్ ఆరంభం కానుంది. బెంగళూరు వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే.. కివీస్ సిరీస్ టీమిండియాకు ఎంతో కీలకం. గెలుపే లక్ష్యంగా రోహిత్ సేన బరిలోకి దిగుతోంది. అయితే కివీస్‌తో…