పూణే వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మొదటి రోజులో తొలి సెషన్ ముగిసింది. లంచ్ బ్రేక్ సమయానికి కివీస్ 31 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. స్టార్ బ్యాటర్లు డేవాన్ కాన్వే (47), రచిన్ రవీంద్ర (5) క్రీజ్‌లో ఉన్నారు. కెప్టెన్ టామ్ లాథమ్ (15), విల్ యంగ్ (18)లు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. ఈ ఇద్దరినీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అవుట్ చేశాడు. టాస్…
పూణే వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మరికొద్దిసేపట్లో రెండో టెస్టు ఆరంభం కానుంది. ఈ టెస్టులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాతమ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఒక మార్పుతో రెండో టెస్ట్ ఆడుతున్నట్లు కివీస్ కెప్టెన్ చెప్పాడు. గాయంతో మాట్ హెన్రీ దూరం కాగా.. మిచెల్ సాంట్నర్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు తాము మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. అందరూ అనుకున్నట్లే కేఎల్ రాహుల్‌ను తుది జట్టు నుంచి…
సొంతగడ్డపై ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత జట్టుకు బెంగళూరులో ఊహించని షాక్ తగిలిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో 46కే ఆలౌట్ అయిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో పోరాడినప్పటికీ మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. లెక్క సరిచేయాలనే పట్టుదలతో ఉన్న భారత్.. పూణేలో పోరుకు సిద్ధమైంది. భారత్, న్యూజిలాండ్ మధ్య గురువారం నుంచే రెండో టెస్టు ఆరంభం కానుంది. మరోవైపు చాలా ఏళ్ల తర్వాత భారత్‌లో సాధించిన విజయం కివీస్ విశ్వాసాన్ని పెంచింది. రెట్టించిన విశ్వాసంతో ఉన్న కివీస్.. భారత్‌లో…
బెంగళూరులో న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. మొదటి ఇన్నింగ్స్‌లో విఫలమైన బ్యాటర్లు.. రెండో ఇన్నింగ్స్‌లో బాగా ఆడారు. కానీ సీనియర్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ఒక్కడే దారుణంగా విఫలమయి.. జట్టులో తన స్థానాన్ని ప్రమాదంలో నెట్టేసుకున్నాడు. రాహుల్ జట్టులో ఎందుకు అంటూ.. సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ చేయడంతో రాహుల్‌కు రెండో టెస్టుల్లో అవకాశం కష్టమేననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్…
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఓడిన భారత్.. రెండో టెస్టులో విజయం సాధించాలని చూస్తోంది. పూణేలో గురువారం నుంచి రెండో టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా మార్పులు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా తుది జట్టులో స్థానం కోసం సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్, యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ల మధ్య గట్టి పోటీనెలకొంది. ఇది వాస్తవమేనని, అందులో దాచడానికి ఏమీ లేదని టీమిండియా సహాయ కోచ్ ర్యాన్…
న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ ఓటమితో సిరీస్‌లో 1-0తో వెనుకంజలో నిలిచిన టీమిండియా.. పూణే టెస్టులో గెలవాలని చూస్తోంది. గురువారం నుంచి రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. బెంగళూరు టెస్ట్ పరాజయం నేపథ్యంలో తుది జట్టులో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాదీ పేసర్, టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌పై వేటు పడే అవకాశాలు ఉన్నాయి.…
టీమిండియా నయా బ్యాటింగ్ సెన్సేషన్ సర్ఫరాజ్ ఖాన్ బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో సత్తాచాటిన విషయం తెలిసిందే. మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయినా.. రెండో ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీ (150)తో జట్టును ఘోర పరాభవం నుంచి తప్పించాడు. తీవ్ర ఒత్తిడిలోనూ అద్భుత ఇన్నింగ్స్ ఆడి సెన్సేషన్ అయ్యాడు. ఎటాకింగ్ ఆటతో ఆకట్టుకున్న సర్ఫరాజ్‌పై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. అదే సమయంలో బీసీసీఐపై సెటైర్స్ వేశాడు. దేశవాళీ క్రికెట్లో పరుగుల…
బెంగళూరులో భారత్‌తో జరిగిన తొలి టెస్టులో అద్భుత విజయం సాధించి.. జోష్‌లో ఉన్న న్యూజిలాండ్‌కు భారీ షాక్ తగిలింది. కివీస్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ రెండో టెస్టుకు సైతం దూరమయ్యాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు మంగళవారం ఉదయం ఓ ప్రకటలో తెలిపింది. గజ్జల్లో గాయం కారణంగా పూణేలో భారత్‌తో జరిగే రెండో టెస్టుకు కేన్ అందుబాటులో ఉండడు అని పేర్కొంది. గాయం కారణంగా కేన్ మామ బెంగళూరు టెస్ట్ ఆడని విషయం తెలిసిందే.…
ఇటీవల టెస్టుల్లో శ్రీలంక చేతిలో దారుణ ఓటములను ఎదుర్కొని భారత్‌లో అడుగుపెట్టిన న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. బెంగళూరులో జరిగిన మొదటి టెస్టులో సంచలన ప్రదర్శనతో సొంతగడ్డపై వరుస విజయాలు సాధిస్తున్న టీమిండియాకు షాక్ ఇచ్చింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ దిశగా దూసుకెళ్తున్న భారత జట్టుకు ఈ ఓటమి మింగుడుపడం లేదు. పూణే టెస్టులో గెలుపే లక్ష్యంగా రోహిత్ సేన బరిలోకి దిగనుంది. ఇందుకోసం జట్టులో మార్పులు తప్పకపోవచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా బ్యాటింగ్‌లో మార్పులు అనివార్యంగా…
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. న్యూజిలాండ్ 107 పరుగుల లక్ష్యాన్ని సునాయసంగా సాధించింది. దీంతో.. 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై న్యూజిలాండ్ టెస్ట్ విజయాన్నందుకుంది. గెలుపు అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. టాస్ ఓడిపోవడం వల్లే భారత్‌తో తొలి టెస్ట్‌లో విజయం సాధించామని అన్నాడు. టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ ఎంచుకునే వాళ్లమని తెలిపాడు.