IND vs NZ: న్యూజిలాండ్‌తో మొదటి వన్డే.. బరిలోకి శ్రేయస్ అయ్యర్, తుది టీమ్ ఇదే!
- నేటి నుంచే భారత్, న్యూజిలాండ్ వన్డే సిరీస్
- వడోదరలో మధ్యాహ్నం 1.30కు తొలి మ్యాచ్ ఆరంభం
- బరిలోకి శ్రేయస్ అయ్యర్, తుది టీమ్ ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ నేటి నుంచి ఆరంభం కానుంది. ఆదివారం మధ్యాహ్నం 1.30 నుంచి వడోదరలో తొలి మ్యాచ్ ఆరంభం కానుంది. 2024లో సొంతగడ్డపై టీమిండియాను వైట్‌వాష్ చేసిన కివీస్.. ఇప్పుడు మరలా భారత పర్యటనకు వచ్చింది. మరోసారి టీమిండియాపై సత్తాచాటాలని కివీస్ టీమ్ భావిస్తోంది. గత పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ చూస్తోంది. రెండు టీమ్స్ బలంగా ఉండడంతో రసవత్తర పోరు ఖాయం. న్యూజిలాండ్‌తో మొదటి వన్డే నేపథ్యంలో భారత్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో చూద్దాం.
ఫామ్ లేమితో టీ20 జట్టులో చోటు కోల్పోయిన శుభ్‌మన్ గిల్ వన్డేలలో కెప్టెన్‌గా ఉన్నాడు. రోహిత్ శర్మతో కలిసి గిల్ ఇన్నింగ్స్‌ను ఆరంభించనున్నాడు. ఈ సిరీస్‌లో రాణించడం అత్యంత కీలకం. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో రాణించిన రోహిత్, విరాట్ కోహ్లీలు జోరు కొనసాగించాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. పొట్ట గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్‌కు ఈ సిరీస్ ఎంతో కీలకం. వన్డేలో రాణిస్తే తిలక్ వర్మ స్థానంలో టీ20లు ఆడే అవకాశం వస్తుంది. ఐదవ స్థానంలో కేఎల్ రాహుల్ ఆడనున్నాడు. కీపింగ్ బాధ్యతలు కూడా అతడే నిర్వర్తిస్తాడు.
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజాలు మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయనున్నారు. కుల్దీప్ యాదవ్ స్పిన్ బాధ్యతలను మోయనున్నాడు. సుందర్, జడేజాలు స్పిన్ బాధ్యతలను పంచుకోనున్నారు. జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేడు. కాబట్టి మహమ్మద్ సిరాజ్ పేస్ దళాన్ని నడిపించనున్నాడు. అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాలు పేస్ బౌలింగ్ పంచుకోనున్నారు. విజయ్ హజారే ట్రోఫీలో ఫిట్‌నెస్, ఫామ్‌ను చాటుకున్న శ్రేయస్ అయ్యర్.. ఈ సిరీస్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. ప్రస్తుతం అందరి దృష్టి శ్రేయస్‌పైనే ఉంది. రో-కో మెరుపులు చూసేందుకు కూడా ఫాన్స్ ఆతృతగా ఉన్నారు. పంత్ సహా యశస్వి జైస్వాల్, ప్రసిద్ధ్ కృష్ణ, నితీష్ కుమార్ రెడ్డి కూడా అవకాశం కోసం వేచి ఉండాల్సి ఉంటుంది.
భారత్ జట్టు (అంచనా):
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కీపర్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!