ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు రసవత్తరంగా మారింది. 193 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 58 పరుగులకే 4 వికెట్స్ కోల్పోయింది. యశస్వి జైస్వాల్ (0), కరుణ్ నాయర్ (14), శుభ్‌మన్ గిల్ (6), ఆకాశ్ దీప్ (1) ఇప్పటికే పెవిలియన్ చేరారు. ఓపెనర్ కేఎల్ రాహుల్ (33; 47 బంతుల్లో 6×4) పోరాడుతున్నాడు. చివరి రోజు భారత్ విజయానికి…
IND vs ENG: భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్ట్ ఉద్వేగ క్షణాల మధ్య తెగ ఉత్కంఠభరితంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లలో ఇరు జట్లు 387 పరుగులకే ఆలౌట్ అయ్యాయి. అయితే, మూడో రోజు ఆట చివర్లో అసలు హంగామా జరిగింది. భారత ఆటగాళ్లు, ముఖ్యంగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్, పేసర్ మహమ్మద్ సిరాజ్ ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీపై తమ అసహనాన్ని బహిరంగంగానే చూపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో టాప్ ట్రెండ్ గా…
క్రికెట్లో ఎప్పుడూ రికార్డులు క్రియేట్ అవుతూనే ఉంటాయి. అలాగే ఉన్న రికార్డులు బద్దలవుతూనే ఉంటాయి. అయితే టెస్ట్ క్రికెట్లో మాత్రం కాస్త భిన్నం. ఇక్కడ రికార్డులు బద్దలుకొట్టాలనుంటే.. అతను ‘ది బెస్ట్ ప్లేయర్’ అయ్యుండాలి. అలాంటి ప్లేయరే జో రూట్. అంతేకాదు ఇప్పడు టెస్ట్ క్రికెట్లో ఉన్న గోట్ ప్లేయర్ కూడా. టెస్టుల్లో విరాట్ కోహ్లీ రిటైర్ కావడంతో ప్రస్తుతం ఫ్యాబ్ ఫోర్లో రూట్, స్టీవ్ స్మిత్ , కేన్ విలియమ్సన్ మాత్రమే ఉన్నారు. రూట్ ఆడిన…
Anil Kumble: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో తొలి రోజు టీమిండియా తరపున ఆడుతున్న తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి హీరో అనడంలో ఎలాంటి సందేహమే లేదని భారత క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే ప్రశంసించారు.
Nitish Kumar Reddy: లార్డ్స్ మైదానంలో ప్రారంభమైన ఇంగ్లాండ్, భారత్ మూడో టెస్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి తన అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. మ్యాచ్ తొలి రోజు టీమిండియా పేసర్లు వికెట్లు తీయడంలో విఫలమైన తరుణంలో.. నితీశ్ ఒక్క ఓవర్లో రెండు కీలక వికెట్లు తీసి ఇంగ్లాండ్ బ్యాటింగ్‌పై పట్టుసాధించాడు. ఇక మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టుకు మంచి ఆరంభం లభించినప్పటికీ.. 14వ ఓవర్ బౌలింగ్‌కు…
టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ గురించి క్రికెట్ లవర్స్ కు పరిచయం అవసరం లేదు. తన అద్భుతమైన ఆటతో భారత క్రికెట్ చరిత్రలో గబ్బర్ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. తన విధ్వంసకరమైన బ్యాటింగ్ తో రికార్డులు క్రియేట్ చేసిన ధావన్.. తన కెరీర్ లో టఫెస్ట్ బౌలర్లను ఎదుర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో తాను ఎదుర్కొన్న డేంజరస్ బౌలర్ల గురించి శిఖర్ ధావన్ తెలిపాడు. దక్షిణాఫ్రికాకు చెందిన డేల్ స్టెయిన్, ఇంగ్లాండ్‌కు చెందిన…
ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి మెరిశాడు. ఓకే ఓవర్లో రెండు వికెట్స్ పడగొట్టి ఔరా అనిపించాడు. ఇన్నింగ్స్ 14 ఓవర్ మూడో బంతికి బెన్ డకెట్ (23) అవుట్ కాగా.. చివరి బంతికి జాక్ క్రాలీ (18) పెవిలియన్ చేరాడు. ఇద్దరు ఓపెనర్లు వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చారు. రెండు వికెట్స్ పడగొట్టిన తెలుగు కుర్రాడిపై ప్రశంసలు కురుస్తున్నాయి.…
ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌కు చుక్కలు చూపించిన భారత్ చారిత్రక విజయం అందుకున్న విషయం తెలిసిందే. 608 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 271 పరుగులకు ఆలౌటవ్వడంతో.. టీమిండియా 336 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. భారత జట్టు విజయంలో శుభ్‌మన్ గిల్ (269, 161), ఆకాశ్ దీప్ (10 వికెట్స్) కీలక పాత్ర పోషించారు. అయితే ఎడ్జ్‌బాస్టన్ టెస్టును మలుపు తిప్పింది రవీంద్ర జడేజా అనే చెప్పాలి. ఐదవ రోజు లంచ్‌కు ముందు ఏం…
Ben Stokes: జూలై 2న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ప్రారంభమైన ఇంగ్లాండ్, భారత్ రెండో టెస్టు మ్యాచ్ లో టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించింది. 336 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసిన భారత్.. ఐదు టెస్టుల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. తొలి టెస్టులో పరాజయం పాలైన గిల్ సేన, రెండో టెస్టులో గట్టి ప్రతీకారం తీర్చుకున్నట్లు అయ్యింది. ముఖ్యంగా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఆటతీరు మ్యాచ్ మొత్తాన్ని మార్చేసింది. ఈ టెస్టులో గిల్ ప్రత్యర్థి…
ENG vs IND: ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా గ్రాంఢ్ విక్టరీ సాధించింది. అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ 336 పరుగుల తేడాతో గెలిచింది.