ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌కు చుక్కలు చూపించిన భారత్ చారిత్రక విజయం అందుకున్న విషయం తెలిసిందే. 608 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 271 పరుగులకు ఆలౌటవ్వడంతో.. టీమిండియా 336 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. భారత జట్టు విజయంలో శుభ్‌మన్ గిల్ (269, 161), ఆకాశ్ దీప్ (10 వికెట్స్) కీలక పాత్ర పోషించారు. అయితే ఎడ్జ్‌బాస్టన్ టెస్టును మలుపు తిప్పింది రవీంద్ర జడేజా అనే చెప్పాలి. ఐదవ రోజు లంచ్‌కు ముందు ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఐదవ రోజు లంచ్‌కు ముందు ఇంగ్లండ్ కీలక బ్యాటర్లు జామీ స్మిత్, బెన్ స్టోక్స్ క్రీజులో ఉన్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన స్మిత్.. రెండో ఇన్నింగ్స్‌లో అప్పటికే 32 పరుగులు చేశాడు. స్టోక్స్ కూడా 33 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. ఇద్దరు కూడా వికెట్ పడకూడదనే పట్టుదలతో ఆడుతున్నారు. ఐదవ రోజు భోజనాని విరామానికి ఇంకా 3 నిమిషాలు (180 సెకన్లు) మాత్రమే మిగిలి ఉన్నాయి. రవీంద్ర జడేజా తన ఓవర్‌ను 95 సెకన్లలో పూర్తి చేశాడు. ఇంకా లంచ్‌కు 85 సెకండ్లు మిగిలాయి. దాంతో అంపైర్ మరో ఓవర్ వేయించాడు.
Also Read: IND vs ENG: బజ్‌బాల్‌కు భారత్ అస్సలు భయపడదు.. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
వాషింగ్టన్ సుందర్ లంచ్‌కు ముందు చివరి ఓవర్ వేశాడు. రెండో బంతికి బెన్ స్టోక్స్ ఎల్బీగా పెవిలియన్ చేరాడు. స్టోక్స్ రివ్యూ తీసుకున్నా లాభం లేకుండా పోయింది. స్టోక్స్ నిరాశగా పెవిలియన్ చేరాడు. రెండో సెషన్లో జామీ స్మిత్ పోరాడాడు. అతడికి స్టోక్స్ తోడైతే టీమిండియాకు సునాయాస విజయం దక్కేది కాదు. లంచ్‌కు ముందు ఓవర్ మరొకరు వేసుంటే.. 95 సెకన్లలో పూర్తి చేసేవారు కాదు. అప్పుడు సుందర్‌కు స్టోక్స్ వికెట్ దక్కేది కాదు. జడేజా కారణంగానే స్టోక్స్ ఔట్ అయ్యాడు. జడేజా తన ఓవర్‌ను 90 సెకండ్ల కంటే ముందే పూర్తి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.