టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ గురించి క్రికెట్ లవర్స్ కు పరిచయం అవసరం లేదు. తన అద్భుతమైన ఆటతో భారత క్రికెట్ చరిత్రలో గబ్బర్ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. తన విధ్వంసకరమైన బ్యాటింగ్ తో రికార్డులు క్రియేట్ చేసిన ధావన్.. తన కెరీర్ లో టఫెస్ట్ బౌలర్లను ఎదుర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో తాను ఎదుర్కొన్న డేంజరస్ బౌలర్ల గురించి శిఖర్ ధావన్ తెలిపాడు. దక్షిణాఫ్రికాకు చెందిన డేల్ స్టెయిన్, ఇంగ్లాండ్‌కు చెందిన జేమ్స్ ఆండర్సన్ అత్యంత ప్రమాదకరమైన బౌలర్లని, వారిని ఎదుర్కోవడం తనకు కష్టమని శిఖర్ ధావన్ తెలిపాడు.
Also Read:Kanipakam Temple: విరిగిన పాలతో అభిషేకం.. స్పందించిన కాణిపాకం ఆలయ ఈవో!
శిఖర్ ధావన్ గత ఏడాది ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన విషయం తెలిసిందే. IANS కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ధావన్ స్లెడ్జింగ్ పై తన అభిప్రాయాన్ని కూడా వెల్లడించాడు. డేల్ స్టెయిన్ ఎప్పుడూ కఠినమైన బౌలర్. అతనికి వేగం, దూకుడు స్వభావం ఉంటాయని ధావన్ IANSతో వెల్లడించారు. జేమ్స్ ఆండర్సన్‌ను భయంకరమైన బౌలర్‌గా ధావన్ అభివర్ణించాడు. నిప్పులు చెరిగే బంతులతో బ్యాట్స్‌మన్‌కు కఠినమైన సవాలు విసిరేవాడని చెప్పాడు.
Also Read:Rambabu: తాను డైరెక్ట్ చేసిన సినిమా చూస్తూ గుండెపోటుతో డైరెక్టర్ మృతి
స్లెడ్జింగ్ విషయానికొస్తే, అది ఆటలో ఒక భాగం. కొన్నిసార్లు స్లెడ్జింగ్ మీలోని ట్యాలెంట్ ను బయటకు తెస్తుంది’ అని ధావన్ అన్నారు. కొన్నిసార్లు మాటల యుద్ధం కూడా ప్రోత్సాహకంగా పనిచేస్తాయని, మ్యాచ్ నుంచి దృష్టి మరల్చవని ధావన్ తెలిపారు. శిఖర్ ధావన్ అంతర్జాతీయ కెరీర్ దశాబ్దానికి పైగా కొనసాగింది. ధావన్ భారత జట్టుకు 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించాడు. శిఖర్ ధావన్ టెస్టుల్లో 2315 పరుగులు, వన్డేల్లో 6793 పరుగులు చేశాడు. అతను టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో 1579 పరుగులు చేశాడు.