IND vs AUS: బ్యాటింగ్ ఆర్డర్ గురించి చెప్పొద్దన్నారు: కేఎల్ రాహుల్
- డిసెంబర్ 6 నుంచి రెండో టెస్టు
- అందుబాటులోకి రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్
- ఆసక్తిగా మారిన ఓపెనింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్టు జరగనుంది. పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన భారత్.. అడిలైడ్ కోసం సిద్దమైంది. డే/నైట్ మ్యాచ్‌గా జరిగే ఈ పింక్ బాల్ టెస్టులో టీమిండియా తుది జట్టు కూర్పు ఆసక్తికరంగా మారింది. తొలి టెస్టుకు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ అందుబాటులోకి రావడంతో.. దేవదత్ పడిక్కల్, ధృవ్ జురెల్ బెంచ్‌కే పరిమితం కానున్నారు. గిల్ మూడో స్థానంలో రానుండగా.. ఇప్పుడు యశస్వి జైస్వాల్‌తో కలిసి ఓపెనింగ్ ఎవరు చేస్తారని ఆసక్తిగా మారింది.
తొలి టెస్టులో కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేశాడు. రెండు ఇన్నింగ్స్‌లలో కీలక పరుగులు చేశాడు. ఇప్పుడు రోహిత్ శర్మ జట్టులోకి రావడంతో.. రాహుల్ ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. పింక్ బాల్ టెస్టుకు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రాహుల్ పాల్గొనగా.. రెండో టెస్టులో మీరు ఏ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తారో చెప్తారా? అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు రాహుల్ బదులిస్తూ.. టీమ్ మేనేజ్మెంట్ నాకు చెప్పింది కానీ.. మీతో ఆ విషయాన్ని పంచుకోవద్దంది’ అని పేర్కొన్నాడు. దాంతో అక్కడ నవ్వులు విరిశాయి. అనంతరం మాట్లాడుతూ.. తాను ఏ ప్లేస్‌లోనైనా ఆడేందుకు సిద్ధమని చెప్పాడు. ఓపెనింగ్, మిడిల్ ఆర్డర్‌లో ఎక్కడైనా తాను ఆడతానని.. జట్టు కోసం ఏదైనా చేయాలన్నారు. తాను తుది జట్టులో మాత్రం ఉండాలనుకుంటున్నా అని రాహుల్ తెలిపాడు.
Also Read
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
Also Read: Aditya 369 Sequel: ‘ఆదిత్య 369’ సీక్వెల్ కన్ఫర్మ్.. హీరో ఎవరో తెలుసా?
‘నేను చాలా స్థానాల్లో బ్యాటింగ్ చేశాను. తొలి 20-25 బంతులను ఎలా ఎదుర్కోవాలో మానసికంగా సవాలుగా ఉండేది. ఎంత తొందరగా అటాక్ చేయాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఏ షాట్ ఆడాలి.. లాంటి విషయాలలు కెరీర్ ఆరంభంలో నా మదిలోకి వచ్చేవి. వాటన్నింటిని నేను అధిగమించా. ప్రస్తుతం టెస్టు, వన్డేల్లో అన్ని స్థానాల్లో ఆడుతున్నా. ఇప్పుడు నా ఇన్నింగ్స్‌ను ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలుసు. ఎక్కడ బ్యాటింగ్ చేసినా తొలి 30 బంతులను సమర్థంగా ఎదుర్కొంటే.. ఆ తర్వాత బ్యాటింగ్ ఈజీ అవుతుంది. నేను ఎప్పుడూ దీనిపైనే దృష్టి పెడతా’ అని కేఎల్ రాహుల్ వివరించాడు.
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!