బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తే, జస్ప్రీత్ బుమ్రా వికెట్స్ పడగొట్టగా.. భారత్ 295 రన్స్ తేడాతో గెలిచింది. ఇక భారత్, ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ వేదికగా పింక్ బాల్‌తో డే/నైట్ టెస్ట్ డిసెంబర్ 6 నుంచి మొదలుకాబోతోంది. అయితే ఆస్ట్రేలియాలో మ్యాచ్, అదీనూ పింక్ బాల్ టెస్ట్ కాబట్టి.. మ్యాచ్ టైమ్, సెషన్ టైమింగ్స్ గురించి తెలుసుకుందాం.
భారత్, ఆస్ట్రేలియా మధ్య డే/నైట్ టెస్ట్ భారత కాలమాన ప్రకారం.. శుక్రవారం ఉదయం 9.30కు ఆరంభం అవుతుంది. అరగంట ముందుగా టాస్ పడుతుంది. మొదటి సెషన్ ఉదయం 9.30 నుండి 11.30 వరకు ఉంటుంది. 40 నిమిషాల అనంతరం రెండో సెషన్ ఆరంభం అవుతుంది. 2వ సెషన్ మధ్యాహ్నం 12.10 నుంచి 2.10 వరకు సాగుతుంది. 20 నిమిషాల టీ బ్రేక్ అనంతరం మూడవ సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 వరకు జరుగుతుంది. నార్మల్ టెస్ట్ మ్యాచ్ అయితే ఉదయం 7.50కి ఆరంభం అవుతుంది. పెర్త్ టెస్ట్ 7.50కి ఆరంభం అయిన విషయం తెలిసిందే. ఇక స్టార్ స్పోర్ట్స్ ఛానెల్స్, డిస్నీ+హాట్‌స్టార్‌లో లైవ్ మ్యాచ్ చూడొచ్చు.
Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీనే టాప్ స్కోరర్.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ జోస్యం!
పింక్ బాల్ టెస్ట్ సెషన్ టైమింగ్స్ ఇవే:
1వ సెషన్: ఉదయం 9.30 నుండి 11.30 వరకు
2వ సెషన్: మధ్యాహ్నం 12.10 నుంచి 2.10 వరకు
3వ సెషన్: మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 వరకు