పాకిస్థాన్‌లో ర్యాలీలో ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పులు జరపడంపై భారత్ స్పందించింది. పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. "ఈ ఘటన ఇప్పుడే జరిగింది.అక్కడి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం.’అని భారత విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తెలిపారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను మరోసారి భారత్‌పై మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. భారత్ అనుసరిస్తున్న స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కొనియాడారు. దేశ ప్రజల కోసం రష్యా నుంచి ధైర్యంగా చమురును కొనుగోలు చేస్తోందన్నారు.
Imran Khan's plea against politics ban rejected by Pakistan court: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు వరస షాక్ లు ఇస్తోంది అక్కడి ప్రభుత్వం. ఇప్పటికే అనేక కేసులు ఇమ్రాన్ ఖాన్ పై నమోదు అయ్యాయి. విదేశీ నేతల నుంచి తనకు లభించిన బహుమతులను విక్రయించడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని దాచిపెట్టినందుకు అక్కడి ఎన్నికల కమీషన్ ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది. ఐదేళ్ల పాటు ప్రభుత్వ పదవిలో…
పాక్ మాజీ ప్రధాని, ప్రతిపక్ష పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌కు రాజకీయగా చుక్కెదురైంది. తోషాఖానా కేసులో ఆయనపై పాకిస్తాన్ ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. కానుకల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయ వివరాలను దాచిపెట్టిన కేసులో ఈ మేరకు చర్యలు చేపట్టింది.
Imran Khan: పాకిస్తాన్ ఉపఎన్నికల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పార్టీ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్(PTI) సత్తా చాటింది. మొత్తం 11 నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరగ్గా 8 చోట్ల PTI గెలిచింది. ఇమ్రాన్ ఖాన్ ఒక్కరే 7 స్థానాలలో పోటీ చేయగా ఆరు స్థానాల్లో విజయం సాధించారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మానంలో ఓటమి చెంది పాక్ ప్రధాని పదవి కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో ఉప ఎన్నికలను ఆయన…
Kidnap: పాకిస్తాన్ లో ఒక సీనియర్ మంత్రిని మిలిటెంట్లు కిడ్నాప్ చేశారు. జైళ్లో ఉన్న తమ సహచరులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాసేపైన తరువాత విడుదల చేశారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ)కి చెందిన సీనియర్ మంత్రి అబైదుల్లా బేగ్‌ను శనివారం మిలిటెంట్లు కిడ్నాప్ చేశారు. ఆయనతో పాటు మరో ఇద్దరు ఆయన సహచరులను కూడా తీసుకువెళ్లారు. శుక్రవారం ఈ ఘటన జరగ్గా ఉగ్రవాదులతో చర్చల అనంతరం శనివారం మంత్రి అబైదుల్లా…
Imran Khan Arrest : పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అధినేత, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను హౌస్ అరెస్ట్ చేసే అవకాశం ఉందని తాజాగా స్థానిక న్యూస్ మీడియా పేర్కొంది. ఇస్లామాబాద్‌లోని బనిగల నివాసంలో అతన్ని గృహనిర్బంధంలో ఉంచడానికి పాక్ ప్రభుత్వం పోలీసులకు అనుమతి ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. విదేశీ నిధుల కేసుకు సంబంధించి ఖాన్‌ను హౌస్ అరెస్టు చేయడానికి పాక్ పోలీసులు రెడీ అవుతున్నారని మీడియా పేర్కొంది. ఇప్పటికే పీటీఐ నాయకులు తారిఖ్ షఫీ, హమీద్ జమాన్,…
Islamabad magistrate issues arrest warrant against Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు రంగం సిద్ధం అవుతోంది. ఇమ్రాన్ ఖాన్ పై ఇస్లామాబాద్ మేజిస్ట్రేట్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మహిళా న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఇస్లామాబాద్ కోర్టు అరెస్ట్ చేయాలని వారెంట్ జారీ చేసినట్లు పాకిస్తాన్ మీడియా వెల్లడించింది. పీటీఐ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవి కోల్పోయిన తర్వాత నుంచి పాకిస్తాన్ వ్యాప్తంగా పర్యటిస్తూ..పీఎం…