Imran Khan: పాకిస్తాన్ దివాళా అంచుకు చేరుకుంది. ఇక అధికార ప్రకటన తరువాయిగా ఉంది. అయితే పాకిస్తాన్ ఈ ప్రమాదం నుంచి కోలుకునేందుకు తెగ కష్టపడుతోంది. పాకిస్తాన్ ప్రధాన మంత్రి షహబాజ్ షరీఫ్ అప్పు కోసం ప్రపంచం అంతా తిరుగుతున్నారు. అయితే దీనిపై ప్రతిపక్ష నేత, మాజీ ప్రధాని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ చైర్మ ఇమ్రాన్ ఖాన్ తీవ్ర ఆరోపణలు చేశారు. షహబాజ్ షరీఫ్ ప్రపంచం అంతా చిప్ప పట్టుకుని అప్పుకోసం తిరుగుతున్నాడని
ధిక్కార కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో పాటు ఆయన పార్టీకి చెందిన ఇతర అగ్రనేతలకు పాకిస్థాన్ ఎన్నికల సంఘం బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది.
Pakistan unemployment: దాయాది దేశం పాకిస్తాన్ లో తీవ్ర నిరుద్యోగం నెలకొంది. ఎంతలా అంటే సాధారణంగా ఏదైనా పోటీ పరీక్షను క్లాస్ రూముల్లో నిర్వహిస్తారు. కానీ పాకిస్తాన్ లో మాత్రం కానిస్టేబుల్ రాత పరీక్షను ఏకంగా ఓ స్టేడియంలో నిర్వహించాల్సి వచ్చింది. అంటే అంతలా అక్కడ నిరుద్యోగం పెరిగిపోయింది. ఇస్లామాబాద్ పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 1,667 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి శనివారం ఇస్లామాబాద్ లో రాత పరీక్ష జరిగింది. దీంతో రిక్రూట్మెంట్ పరీక్షను ఇస్లామాబాద్ స్పోర్ట్స్…
పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఒక మహిళతో అసభ్యకర పదజాలం వాడిన ఆడియో రికార్డింగ్ ఆన్లైన్లో లీక్ కావడంతో తాజా వివాదంలో పడ్డారు. రెండు భాగాల ఆడియో క్లిప్‌ను పాకిస్థాన్ జర్నలిస్ట్ సయ్యద్ అలీ హైదర్ తన యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేశారు.
Wanted To Improve Strained Ties With India During My Tenure, says imran khan: తన హయాంలో భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని తాను కోరుకున్నానని, అయితే కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేయడం అడ్డంకిగా మారిందని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోమవారం అన్నారు. అప్పటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బజ్వా కూడా భారత్ తో మెరుగైన సంబంధాలకు మొగ్గు చూపారని అన్నారు. అయితే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం, జమ్మూ కాశ్మీర్…
Imran Khan Calls For Fresh Polls In Pakistan: పాకిస్తాన్ తో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్ ఖాన్ దిగిపోయి.. షహజాబ్ షరీఫ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి అక్కడ రాజకీయ సంక్షోభం మొదలైంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఆజాదీ మార్చ్ పేరుతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాడు.
Imran Khan "Sold" Gold Medal Received From India: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ఆ దేశ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ పై పలు కేసులు నమోదు చేసింది షహజాబ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం. తాజాగా పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, ఇమ్రాన్ ఖాన్ పై సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఇమ్రాన్ ఖాన్ భారతదేశం నుంచి అందుకున్న…
బెనజీర్ భుట్టో హత్య: 2007 ఎన్నికల ర్యాలీలో పాల్గొంటున్న బెనజీర్ భుట్టో పై దాడి చేసి హతమార్చారు. రావల్పిండిలో ఈ ఘటన జరిగింది. రెండు సార్లు ప్రధానిగా పనిచేసిన జెనజీర్ భుట్టో.. ఆ ఏడాది జరుగబోయే ఎన్నికల్లో గెలుస్తుందని పాక్ ప్రజలు భావించారు. ఈ ఘటనకు కొన్ని నెలల ముందు కరాచీలో జరిగిన ఆత్మాహుతి దాడి నుంచి తప్పించుకున్న భుట్టో చివరకు రావల్పిండి దాడిలో చనిపోయింది. ఈ దాడిలో 139 మంది మరణించారు.
పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధ్యక్షుడు, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేపట్టిన ర్యాలీలో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. కాల్పులు జరిపిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.