Pakistan: పాకిస్తాన్ రణరంగంగా మారుతోంది. గవర్నమెంట్ వర్సెస్ ఇమ్రాన్ ఖాన్ గా వివాదం ముదురుతోంది. ఇమ్రాన్ ఖాన్ కోర్టుకు వెళ్లగానే పాక్ పోలీసులు ఆయన ఇంట్లో వీరంగం సృష్టించారు. లాహోర్ లోని జమాన్ పార్క్ లో ఉన్న ఇమ్రాన్ ఇంటికి చేరుకున్న పోలీసులు.. ఆయన లేని సమయంలో శనివారం ఇంట్లో ప్రవేశించారని పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాప్ పార్టీ ఆరోపించింది. ఆయన భార్య బుష్రా బేగం ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో పోలీసులు ఇంట్లోకి ప్రవేశించారని ఆరోపించారు. …
తోషాఖానా కేసు విచారణకు సంబంధించి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్ వెళ్తుండగా ఆయన కాన్వాయ్లోని వాహనం ప్రమాదానికి గురైందని పాక్ మీడియా వెల్లడించింది.
పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ను ఉగ్రవాద సంస్థగా పరిగణించాలని పాకిస్తాన్ ముస్లిం లీగ్ (పీఎమ్ఎల్-ఎన్) వైస్ ప్రెసిడెంట్ మర్యమ్ నవాజ్ షరీఫ్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కోరారు.
Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టుని వాయిదా వేయాలని పోలీసుల్ని లాహోర్ హైకోర్టు ఆదేశించింది. ఇమ్రాన్ ఖాన్ ని అరెస్టు చేసేందుకు రెండురోజులుగా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆయన నివాసానికి పెదయెత్తున బలగాలు వస్తున్నాయి. పోలీసులతో ఇమ్రాన్ ఖాన్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఘర్షణకు దిగుతున్నారు. దీంతో లాహోర్ హైకోర్టు ఇమ్రాన్ ఖాన్ అరెస్టుని వాయిదా వేయాలని ఆదేశించింది. లాహోర్ హైకోర్టు ఆదేశాలతో పోలీసుల అరెస్ట్ ఆపరేషన్ ఆగిపోయింది. Read Also: YS Viveka…
Imran Khan Arrest: పాకిస్తాన్ రణరంగంగా మారుతోంది. సివిల్ వార్ దిశగా పాకిస్తాన్ వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడి ఆర్మీ, పోలీసులను ఇమ్రాన్ మద్దతుదారులు సవాల్ చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసేందుకు అక్కడి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోంది. తోషాఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసేందుకు లాహోర్ లోని జమాన్ పార్క్ వద్ద…
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై సోమవారం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయబడింది. ఖాతూన్ జడ్జి జెబా చౌదరిని బెదిరించిన కేసుకు సంబంధించి సివిల్ జడ్జి జిల్లా సెషన్స్ కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది.
పాకిస్థాన్లోని వివిధ హైకోర్టుల ఆదేశాల మేరకు పీటీఐ చట్టసభ సభ్యులు రాజీనామా చేయడంతో ఖాళీ అయిన 37 పార్లమెంట్ స్థానాలకు ఆదివారం పాకిస్థాన్ అత్యున్నత ఎన్నికల సంఘం ఎన్నికలను నిలిపివేసింది.
Imran Khan : పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు స్వల్ప ఊరట లభించింది. ప్రస్తుతానికి ఆయన అరెస్ట్ చేయకుండా లాహోర్ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికల కమిషన్ (ECP) వెలుపల నిరసనలకు సంబంధించిన కేసులో లాహోర్ హైకోర్టు సోమవారం అతని రక్షణ బెయిల్ పిటిషన్ను ఆమోదించింది. ఇమ్రాన్ ఖాన్ తన వ్యక్తిగత ప్రదర్శనపై గంటల తరబడి రాజకీయ నాటకం తర్వాత చివరకు కోర్టు గదికి చేరుకున్నాడు.
Pakistan Economic Crisis: పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. అక్కడి ప్రజలు గోధుమ పిండి, గ్యాస్, పెట్రోల్ ధరలు పెరగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాకిస్తాన్ ఈ పరిస్థితుల నుంచి తమను కాపాడాలని ఐఎంఎఫ్ ని అడుగుతోంది. ఇటీవల పదిరోజుల పాటు అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్)తో పాక్ ప్రభుత్వం చర్చలు జరిపింది.
Imran Khan: పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది దాయాది దేశం పాకిస్తాన్. ఈ సమస్య నుంచి బయటపడేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) బెయిలౌట్ ప్యాకేజ్ కోసం తాత్కాలిక ఒప్పందం చేసుకుంది. అయితే ఈ ఒప్పందంపై పాక్ మాజీ ప్రధాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. క్యాన్సర్ చికిత్సకు డిస్ప్రిన్ (ఆస్పిరిన్)(నొప్పి నుంచి ఉపశమనానికి వాడే ట్యాబ్లెట్)ను వాడతారా..?