Imran Khan: ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరతల మధ్య పాకిస్తాన్ బతుకీడుస్తోంది. అక్కడి జనాలకు తినడానికి తిండి కరువైంది. విదేశీమారక నిల్వలు లేక దిగుమతులు చేసుకోలేని పరిస్థితి. అరబ్ దేశాలు, ఆల్ టైం ఫ్రెండ్ చైనా కూడా పెద్దగా పాకిస్తాన్ ను పట్టించుకోవడం లేదు. దీనికి తోడు ఇటీవల కాలంలో పాక్ ప్రభుత్వం,
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీల వివాహ వేడుకను ఇస్లామిక్ షరియా చట్టం ప్రకారం నిర్వహించలేదని పాక్ మతపెద్ద ముఫ్తీ మహ్మద్ సయీద్ అన్నారు. 2018లో ఈ జంట ఇస్లామిక్ వివాహం జరిపించిన మతగురువులు, ఇది బుష్రా బీబీ ఇద్దత్ కాలంలో జరిగిందని చెప్పారు.
Javed Miandad: పాకిస్తాన్ లో జరగబోయే ఆసియా కప్ క్రికెట్ టోర్నీకి భారత జట్టు వెళ్లకూడదని నిర్ణయించుకుంది. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కారాలుమిరియాలు నూరుతోంది. పాక్ మాజీ ఆటగాళ్లు భారత్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. క్రికెట్ ప్రపంచంలో బీసీసీఐ నియంతలా ప్రవర్తిస్తోందని పాక్ మాజీ ఆటగాడు, ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విమర్శించారు.
పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి తెహ్రీక్ ఇ ఇన్సాఫ్( పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత్ దేశ విదేశాంగ విధానాన్ని ప్రశంసించారు. తాము కూడా భారత్ లానే రష్యా నుంచి చౌకగా క్రూడ్ ఆయిల్ ని పొందాలని కోరుకుంటున్నామని చెప్పారు. కానీ తన ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంలో కూలిపోవడంతో అలా చేయలేకపోయామని చెప్పారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కట్టుదిట్టమైన భద్రత మధ్య లాహోర్లోని ఉగ్రవాద నిరోధక కోర్టుకు చేరుకున్నారు. అయితే, మాజీ ప్రధాని తలపై ధరించే విచిత్రమైన బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్ చాలా మంది దృష్టిని ఆకర్షించింది.
Pakistan Economic Crisis: పాకిస్తాన్ ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయింది. అక్కడి ప్రభుత్వం ప్రజలకు నిత్యావసరాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. పాకిస్తాన్ వ్యాప్తంగా ధరలు దారుణంగా పెరిగాయి. ఇక ఐఎంఎఫ్ బెయిలౌట్ ప్యాకేజీని పొందేందుకు ఇబ్బదిముబ్బడిగా పన్నులను పెంచింది. దీంతో అక్కడ విద్యుత్, పెట్రోల్ రేట్లు పెరిగాయి. ఇక పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఇప్పటికే డిఫాల్ట్ అయిందని వ్యాఖ్యానించాడు. తాజాగా దేశంలో ఎన్నికలు జరిపేందుకు ఫైనాన్స్ మినిస్ట్రీ వద్ద డబ్బుల్లేవని వెల్లడించారు.
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపనలు చేశారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ ( పీఎంఎల్-ఎన్) ప్రభుత్వం నన్ను చంపేందుకు కుట్ర పన్నిందని ఆరోపించారు. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ చీఫ్ గా ఉన్న ఇమ్రాన్ ఖాన్ తన మద్దతుదారులతో వీడియో ప్రసంగంలో మాట్లాడుతూ ఈ ఆరోపణలు చేశారు. గతేడాది ఆయనపై హత్యప్రయత్నం జరిగింది. 1996లో బెనజీర్ భుట్టో అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ కాల్పుల్లో మరణించిన ముర్తాజా భుట్టో తరహాలోనే తనను హత్య చేసేందుకు…
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ(పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ కు ఉచ్చుబిగుస్తోంది. ఇప్పటికే పలు కేసుల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పై తాజాగా పోలీసులు తీవ్రవాద కేసు నమోదు చేశారు. అవినీతి కేసులో కోర్టు విచారణకు ముందు ఇస్లామాబాద్లోని జ్యుడిషియల్ కాంప్లెక్స్ వెలుపల విధ్వంసానికి పాల్పడడం, భద్రతా సిబ్బందిపై దాడి చేయడం, శాంతి భద్రతలకు భంగం కలిగించినందుకు ఇమ్రాన్ ఖాన్ తో పాటు మరికొంత మందిపై పాకిస్తాన్ పోలీసులు…
Pak Police Recovers Weapons, Petrol Bombs From Imran Khan's House: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసేందుకు అక్కడి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. తోషాఖానా కేసులో ఆయన్న అరెస్ట్ చేసేందుకు రెండు రోజల క్రితం ప్రయత్నించగా.. ఆయన మద్దతుదారుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఇదిలా ఉంటే శనివారం అవినీతి కేసులో ఇస్లామాబాద్ కోర్టుకు హాజరయ్యేందుకు ఇమ్రాన్ ఖాన్ వెళ్లారు. దీంతో…