అవినీతి కేసులో అరెస్టయిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను జైలులోనే హతమార్చేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ దేశ వ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. అతడిని చిత్రహింసలకు గురిచేశారని, గుండెపోటు వచ్చేలా ఆహారం, ఇంజెక్షన్ ఇచ్చారని ఇమ్రాన్ తరఫున వాదించే లాయర్లు పేర్కొన్నారు.
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఊరట లభించింది. ఆయన అరెస్ట్ అక్రమం అంటూ పాకిస్తాన్ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయనను అరెస్ట్ చేయడం కోర్టు ధిక్కారం కిందికే వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇమ్రాన్ ఖాన్ ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘అల్ ఖదీర్ ట్రస్ట్’ అవినీతి కేసులో ‘నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో’’(ఎన్ఏబీ) ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసింది.
Pakistan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ ఆ దేశంలో విధ్వంసం సృష్టిస్తోంది. పీటీఐ కార్యకర్తలు, ఇమ్రాన్ మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనలు హింసాత్మక రూపుదాల్చాయి. ఇప్పటికే భద్రతాబలగాల కాల్పుల్లో 8 మంది మరణించారు. మరోవైపు ఖైబర్ ఫక్తుంఖ్వా, బలూచిస్తాన్, పంజాబ్ ప్రావిన్సుల్లో శాంతిభద్రతలను పాకిస్తాన్ సైన్యం తన ఆధీనంలోకి తీసుకుంది.
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్‌ఖాన్ అరెస్ట్ నేపథ్యంలో ఆ దేశంలో పరిస్థితి గందరగోళంగా తయారైంది. పాక్‌లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మంగళవారం ప్రారంభమైన అల్లర్లు, ఆందోళనలు బుధవారమూ కొనసాగాయి. పలుచోట్ల విధ్వంసాలు చోటుచేసుకున్నాయి. ఏడుగురు మృతి చెందగా 300 మందికి గాయాలయ్యాయి.
Pakistan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో ఆ దేశం రణరంగంగా మారింది. ఆయన మద్దతుదారులు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ తో పాటు కరాచీ, పెషావర్, లాహోర్, క్వెట్టా ఇలా అన్ని ప్రధాన నగరాల్లో, పట్టణాల్లో ఆందోళనలు మిన్నంటాయి.
Imran Khan: అల్ ఖదీర్ ట్రస్ట్ అవినీతి కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను నిన్న పాకిస్తాన్ పారామిలిటరీ రేంజర్లు అరెస్ట్ చేశారు. ఇస్లామాబాద్ కోర్టు ఆవరణలోనే ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే ఈ కేసులో 8 రోజుల రిమాండ్ విధించింది ‘నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో’(ఎన్ఏబీ) కోర్టు. 10 రోజుల రిమాండ్ కోరినప్పటికీ కోర్టు మాత్రం 8 రోజులకు మాత్రమే అనుమతించింది. ఇదిలా ఉంటే తనకు ప్రాణాహాని ఉందని ఇమ్రాన్…
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ(పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తో పాకిస్తాన్ భగ్గుమంది. నిన్న ఇస్లామాబాద్ లో ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తర్వాత నుంచి ఆ దేశంలోని అన్ని నగరాల్లో, పట్టణాల్లో పీటీఐ కార్యకర్తలు, ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు.
Imran Khan Arrest: మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తో పాకిస్తాన్లో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో వేలాది మంది రోడ్ల మీదకు వచ్చి భారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఇమ్రాన్ అరెస్టుపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది.
Sehar Shinwari : అవినీతి ఆరోపణల నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టయ్యారు. అప్పటి నుంచి దేశంలో అల్లర్లు జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితిపై పాక్ నటి సెహర్ షిన్వారీ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Protests in Pakistan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ)పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ను పాకిస్తాన్ పారామిలిటరీ రేంజర్లు మంగళవారం ఇస్లామాబాద్ కోర్టు వెలుపల అరెస్ట్ చేశారు. అవినీతి కేసులో ఆయన్ను అరెస్ట్ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇదిలా ఉంటే అరెస్టుకు ముందు ఇమ్రాన్ ఖాన్ ఓ వీడియో సందేశంలో మాట్లాడుతూ.. తనను అరెస్ట్ చేసి చంపేందుకు