Weather Updates : తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) భారీ వర్ష సూచన జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. తెలంగాణ విషయానికి వస్తే, ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నల్గొండ, , హైదరాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. Peddireddy…
Southwest Monsoon: దేశానికి అత్యధికంగా వర్షపాతానిచ్చే నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా ముందుకు కదులుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం నాటికి అవి దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.
నైరుతి రుతుపవనాలు ఈసారి మే 27న కేరళను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇవాళ తెలిపింది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించాక జులై 8 నాటికి భారత్ వ్యాప్తంగా విస్తరిస్తాయి. సాధారణంగా ప్రతి ఏడాది జూన్ 1 లేదా ఆ తర్వాత రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. దీంతో వర్షాకాలం ప్రారంభమైందని భావిస్తాం. అయితే 2009లో నైరుతి రుతుపవనాలు మే 23నే ప్రవేశించాయి. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు అంచనాల కంటే చాలా ముందుగానే నైరుతి…
Heat Waves: తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు భారీ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో రోజు రోజుకు ఎండల తీవ్రత భారీగా పెరుగుతుంది. ఇక, ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
తెలంగాణలో మళ్లీ వర్షాలు కురవనున్నాయి. ద్రోణి ప్రభావంతో ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. బలమైన ఈదురుగాలులతో.. ఉరుములు, మెరుపులతో వర్షాలు బీభత్సం సృష్టించాయి. మండు వేసవిలో వర్షాలు కురవడంతో ప్రజలు ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందుతున్నారు. అయితే అకాల వర్షాలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. చేతికి వచ్చిన పంట నీటిపాలవడంతో కన్నీరు పెడుతున్నారు. ఇప్పుడు మళ్లీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పడంతో ఆందోళన చెందుతున్నారు. రాగల రెండు గంటల్లో హైదరాబాద్ తో పాటు…
తెలంగాణలో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతుంది. వడగాల్పుల ప్రభావం కూడా ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం 15 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, ఖమ్మం, కొమరంభీం, మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వనపర్తి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ అయ్యింది. కాగా.. సోమవారం (మార్చి 31) ఆదిలాబాద్‌లో సాధారణం కన్నా 2.4 డిగ్రీలు పెరిగి…
ఏపీలో అకాల వర్షాలు.. మరో నాలుగు రోజులు కురుస్తాయని.. ఈ సమయంలో వడగళ్ల వాన పడుతుందని.. ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణశాఖ.. క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని.. వడగళ్ల వాన పడుతుందని పేర్కొంది..
Telangana Heatwave Alert: మార్చి నెల ప్రారంభంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయి. మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
IMD: 1901 తర్వాత భారతదేశంలో ఫిబ్రవరి నెలలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. సగటు ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు శుక్రవారం వెల్లడించింది. మొదటిసారిగా, దేశవ్యాప్తంగా సగటు కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదైంది. 124 ఏళ్ల తర్వాత అత్యంత వెచ్చని ఫిబ్రవరి నమోదైంది. Read Also: Justice Bela Trivedi: ‘‘ఆమె జైలులోనే ఉండనివ్వండి, బరువు తగ్గుతుంది’’.. ఇది గోధుమ, శనిగ…
Dense Fog: దేశ రాజధాని ఢిల్లీలో పొగ మంచు కప్పేసింది. దట్టమైన పొగ మంచు వల్ల విజిబిలిటీ సున్నాకు పడిపోయింది. దీంతో, విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కొనసాగుతుంది. మరోవైపు, ఇప్పటికే ఢిల్లీకి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.