Delhi Rains: దేశ రాజధాని ఢిల్లీని భారీలు వణికిస్తున్నాయి. ఆదివారం తెల్లవారు జామున ఈదురు గాలులతో కూడిన కుండపోత వర్షంతో.. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. దీంతో, వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Heavy Rains: దేశ రాజధాని ఢిల్లీని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం తెల్లవారుజామున కురిసిన వర్షం దెబ్బకు పలు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అయితే, ఢిల్లీ- ఎన్సీఆర్ లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.
ఈ ఏడాది ముందుగానే రుతుపవనాలు వచ్చేశాయి. కొద్ది సేపటి క్రితమే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయని కేంద్ర వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
ఈ ఏడాది వేసవి కాలంలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. సమ్మర్ అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతాయి. దేశ వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. కానీ ఈ ఏడాది భిన్నమైన వాతావరణం నెలకొంది. పెద్దగా ఎండల ప్రభావం కనిపించకుండానే వేసవి ముగుస్తోంది.
కేంద్ర వాతావరణ శాఖ దేశ ప్రజలకు చల్లని కబురు చెప్పింది. ఈ ఏడాది ఐదు రోజులు ముందుగానే.. అనగా మే 25న నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు ఐఎండీ తెలిపింది.
భారీ తుఫాన్ దేశ రాజధాని ఢిల్లీని హడలెత్తించింది. బుధవారం సృష్టించిన విలయానికి నగరం అతలాకుతలం అయింది. దుమ్ము, ఈదురుగాలులతో కూడిన వర్షంతో జనజీవనం అస్తవ్యస్తం అయింది.
తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా ఉత్తర కర్ణాటక-గోవా తీరాల నుండి కోస్తాంధ్ర వరకు సముద్ర మట్టానికి 3.1కి.మీ ఎత్తు వరకు ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజులు మేఘావృతమైన వాతావరణంతో పాటు చెదురుమదురుగా భారీవర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గంటకు 40-50 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు…
Rain Alert : నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. వచ్చే మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముండగా, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనంతో ముడిపడి, ద్రోణి మధ్య కోస్తా ఆంధ్ర తీరం వరకు ఏర్పడిందని తెలిపింది. ఇది సముద్రమట్టానికి 1.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని వివరించింది.…
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అధికారులు బిగ్ అలర్ట్ జారీ చేశారు. నేడు, రేపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాలో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని పేర్కొన్నారు.