దానా తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది. ఈ తుఫాన్ పెను బీభత్సం సృష్టించనుంది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ ఇప్పటికే ఆయా రాష్ట్రాలను అలర్ట్ చేసింది. ప్రాముఖ్యంగా పశ్చిమబెంగాల్, ఒడిశాపై తీవ్ర ప్రభావం చూపనుంది.
టెక్ సిటీ బెంగళూరును భారీ వరద ముంచెత్తింది. మంగళవారం రికార్డ్ స్థాయిలో వర్షం కుమ్మేసింది. దీంతో రోడ్లు, ఇళ్లు నీటమునిగాయి. కార్లు, బైకులు కొట్టుకుపోయాయి. జనజీవనం అస్తవ్యస్థం అయిపోయింది. ఇక ఇళ్లల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గిన్నెలతో నీళ్లు బయటకు పంపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఉత్తర అండమాన్ సముద్రం మీదుగా ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లోపు తూర్పుమధ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి, అక్టోబర్ 22 ఉదయం నాటికి వాయుగుండంగా, అక్టోబర్ 23 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉంది.
దక్షిణ మధ్య బంగాళాఖాతంలో మరింత బలపడిన అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తుందని విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు. దీని ప్రభావంతో ఏపీలో రానున్న మూడ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నామన్నారు.
Telangana Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల వరకు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
Tamil Nadu Rains: బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఈ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో 10జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. చెన్నై సహా మరో ఐదు జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు ఇచ్చింది.
ఈరోజు తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకొచ్చింది. ఇక, ఇవాళ (శుక్రవారం) తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా.. తమిళనాడు డెల్టా ప్రాంతంలో 8 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.