ఉత్తర భారత్‌ను తీవ్రమైన వడగాలులు హడలెత్తిస్తున్నాయి. గత కొద్ది రోజులు ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి. దీంతో బయటకురావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఉదయం నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. దీంతో వృద్ధులు, పిల్లలు బెంబేలెత్తిపోతున్నారు.
బంగాళాఖాతంలో కొనసాగుతుంది అల్పపీడనం.. ఇవాళ వాయుగుండంగా మారే ఛాన్స్ ఉంది. ఈ నెల 25వ తేదీ వరకు తుఫాన్ గా మారితే రెమల్‌గా నామకరణం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో రెండు రోజుల పాటు తేలిక పాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
దేశంలోని పలు ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో.. జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజస్థాన్‌లోని బార్మర్‌లో 48.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అనేక ప్రాంతాల్లో వేడిగాలులు వీచాయి. కాగా.. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు దేశంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ మరియు మధ్యప్రదేశ్‌లలోని కనీసం 16 ప్రదేశాలలో గురువారం గరిష్టంగా 45 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేడి గాలులు కనీసం ఐదు రోజుల పాటు కొనసాగుతుందని భారత వాతావరణ…
ఏపీలో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలకు సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆనుకుని అల్పపీడనం బలపడుతోంది.
నైరుతి బంగాళాఖాతంలో రేపు (బుధవారం) అల్పపీడనం ఏర్పడనుంది. ఇది ఈశాన్యంగా పయనించి ఈనెల 24వ తేదీ వరకు మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి అక్కడ వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఈ నెల చివర వరకు తుఫాన్ గా మారే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కుండపోతగా వర్షం కురిసింది. గ్రేటర్ పరిధిలో భారీ వర్షపాతం నమోదైంది. నేటి మధ్యాహ్నం వరకు ఉక్కపోతతకు ఉక్కిరిబిక్కిరి అయిన హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.
Southwest Monsoon Likely to hit Andaman Coast on May 19th: తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. గత ఏడాది అంతంత మాత్రంగానే కురిసిన వర్షాలు.. ఈ ఏడాది మాత్రం ఆశాజనకంగా ఉంటాయని తెలిపింది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రీ మాన్‌సూన్ రెయిన్స్ ప్రారంభమయ్యాయి. దక్షిణ విదర్భ నుంచి కర్నాటక వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక వద్ద…
Monsoon: భారత వాతావరణ శాఖ(ఐఎండీ) చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు మే 31 నాటికి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని అంచనా వేసింది. నాలుగు రోజులు అటూ ఇటూగా రుతుపవనాలు భారతదేశ ప్రధాన భూభాగాన్ని తాకనున్నాయి.