దేశంలోని పలు ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో.. జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజస్థాన్‌లోని బార్మర్‌లో 48.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అనేక ప్రాంతాల్లో వేడిగాలులు వీచాయి. కాగా.. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు దేశంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ మరియు మధ్యప్రదేశ్‌లలోని కనీసం 16 ప్రదేశాలలో గురువారం గరిష్టంగా 45 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేడి గాలులు కనీసం ఐదు రోజుల పాటు కొనసాగుతుందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది.
ADR Report: లోక్‌సభ అభ్యర్థులపై సంచలన రిపోర్ట్! ఎంతమంది నిరక్షరాస్యులున్నారంటే..!
రాజస్థాన్‌లోని చురులో అత్యధికంగా 47.4 డిగ్రీల సెల్సియస్, ఫలోడిలో 47.8 డిగ్రీలు, జైసల్మేర్‌లో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్‌లోని గుణాలో 46.6 డిగ్రీలు, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 45.9 డిగ్రీలు, ఉత్తరప్రదేశ్‌లోని ఒరాయ్‌లో 45 డిగ్రీలు, పంజాబ్‌లోని భటిండా మరియు హర్యానాలోని సిర్సాలో 45.4 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే.. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత గురువారం స్వల్పంగా తగ్గింది.
Sruthi: బాయ్ ఫ్రెండుతో బ్రేకప్.. మింగిల్ అయ్యేందుకు రెడీ అంటూ శ్రుతి షాకింగ్ వీడియో
రాజస్థాన్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ మరియు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లకు వాతావరణ శాఖ ‘రెడ్’ హెచ్చరికను జారీ చేసింది. ఈ ఎండల వేడి వల్ల అనారోగ్యం, హీట్‌స్ట్రోక్ వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ మరియు రాజస్థాన్‌లలో రాబోయే మూడు రోజులలో రాత్రిళ్లు కూడా వేడిగా ఉంటాయని పేర్కొంది. ఇదిలా ఉంటే.. బయట పనిచేసేవారు, వృద్ధులు, పిల్లలు వేడి అలసట మరియు హీట్‌స్ట్రోక్‌కు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు అంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, 1998-2017 మధ్య 1,66,000 మందికి పైగా ప్రజలు వేడి తరంగాల ఫలితంగా మరణించారు.