Red Alert: రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.
Mumbai rain: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షం కారణంగా ముంబైలోని వీధులు అన్ని చెరువులను తలపిస్తున్నాయి. రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టుల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో.. ఇప్పటికే 50 విమానాలు రద్దు కాగా, పలు ప్రాంతాలకు వెళ్లే రైళ్లను సైతం రద్దు చేశారు
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాల లిస్టు విడుదల చేసింది.
Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వాతావరణం చల్లబడడమే కాకుండా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. తాజాగా వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు వర్ష హెచ్చరిక జారీ చేసింది.
దేశ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించాయి. దీంతో ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో అయితే వరదలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే పలువురు మృత్యువాత పడగా.. మరికొందరు నివాసాలు కోల్పోయి నిరాశ్రయులయ్యారు.
Delhi Weather: ఢిల్లీలో రుతుపవనాలు ప్రవేశించడంతో ప్రజలు వేడి నుండి ఉపశమనం పొందారు. అయితే, ఒక రోజు వర్షం తర్వాత తేమ వేడితో ప్రజలు మరోసారి ఇబ్బంది పడ్డారు.
దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారం వెల్లడించింది.
ఢిల్లీ-ఎన్‌సీఆర్ సహా ఉత్తర భారత రాష్ట్రాల్లో రుతుపవనాలు ప్రవేశించాయి. అయితే రుతుపవనాలు వ్యాపించని రాష్ట్రాలు ఇప్పటికీ ఉన్నాయి. ఇందులో హర్యానా, పంజాబ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అయితే ఈ ప్రాంతాలకు కూడా వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది.
దేశ వ్యాప్తంగా కురిసిన వర్షాలపై కేంద్ర వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది వర్షాకాల సీజన్లో ఇప్పటివరకు సాధారణం కంటే సగటున 20 శాతం వర్షాలు తక్కువగా పడ్డాయని భారత వాతావరణశాఖ తెలిపింది.