కేరళలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మే 19, 20 తేదీల్లో రాష్ట్రంలోని పతనంతిట్ట, కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. 24 గంటల్లో 20 సెం.మీ కంటే ఎక్కువగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. అలాగే తిరువనంతపురం, కొల్లాం, అలప్పుజా, ఎర్నాకులంలలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మే 21న తొమ్మిది జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేయగా.. వాటిలో కొన్నింటిలో రెడ్ అలర్ట్ మాదిరిగానే వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఇది కూడా చదవండి: RGV – Revanth Reddy: ఒకే ఫ్రెమ్ లో ఇద్దరు ఫైర్ బ్రాండ్స్..
ఇక మే 19-22 మధ్య కేరళలో ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన గాలివానలు సంభవించే అవకాశం ఉందని కూడా అంచనా వేసింది. శనివారం పతనంతిట్ట, ఇడుక్కి, మలప్పురం జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో బలమైన పశ్చిమ మరియు నైరుతి గాలులు వీచే అవకాశం ఉన్నందున మే 18-20 మధ్య రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఇది కూడా చదవండి: Swati Maliwal Case: కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ అరెస్ట్