శుక్రవారం దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో సెకండ్ విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇదిలా ఉంటే కేంద్ర వాతావరణ శాఖ బాంబ్ పేల్చింది.
దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎండవేడిమి, తీవ్ర వడగాల్పుల మధ్య జనాలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో.. వాతావరణ శాఖ ఒక ఉపశమనం వార్త చెప్పింది. IMD ప్రకారం.. దేశంలోని అనేక ప్రాంతాల్లో వాతావరణ మార్పులు మారబోతున్నాయి. ఏప్రిల్ 26 నుంచి 28 వరకు వాయువ్య భారతదేశంలో మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు.. ఈశాన్య భారతదేశంలో కూడా ఎండల బారీ నుండి ప్రజలు కూడా ఉపశమనం పొందనున్నారు. ఏప్రిల్ 27,…
Monsoon: ఈ సారి రుతుపవన కాలంలో వర్షాలు సాధారణం కన్నా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. రుతపవనాలకు అనుకూలంగా పసిఫిక్ మహాసముద్రంలో ‘‘లానినా’’ పరిస్థితులు ఆగస్టు- సెప్టెంబర్ నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ సోమవారం తెలిపింది.
TS Weather: భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. హైదరాబాద్‌లోనూ ఎండల తీవ్రతకు ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. మూసాపేటలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఏపీ ప్రజల్ని వాతావరణశాఖ అలర్ట్ చేసింది.. రాష్ట్రంలో వడగాల్పులు కొనసాగుతున్నాయి. రానున్న రెండ్రోజుల పాటు తీవ్ర వడగాల్పులు వీస్తాయని ఏపీ వాతావరణశాఖ హెచ్చరించింది. సోమవారం 31 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 139 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం 33 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 113 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
తెలంగాణలో గత నాలుగైదు రోజులుగా వాతావరణ పరిస్థితి మారింది. రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. తాజాగా.. రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ చల్లటికబురు చెప్పింది. రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుసే అవకాశం ఉందని వెల్లడించింది.
Monsoon: వేసవి ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తీపి కబురు చెప్పింది. ఈ సారి వర్షాలు సకాలంలో వస్తాయా..? లేదా.? అనే అనుమానాల నేపథ్యంలో ఐఎండీ కీలక విషయాలను వెల్లడించింది.
రాష్ట్రంలో భానుడు భగభగ మండిపోతున్నాడు. సూర్య ప్రతాపంతో ఎండ వేడికి తట్టుకోలేక జనం అల్లాడిపోతున్నారు. చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రత 43 డిగ్రీలకు పైనే నమోదవుతోంది. అయితే తెలంగాణలో గత మూడు రోజులుగా వాతావరణ పరిస్థితి మారింది. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. తాజాగా.. రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ చల్లటికబురు చెప్పింది.
ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. భానుడు భగభగ నిప్పులు కక్కుతున్నాడు. ఐఎండీ సూచనల ప్రకారం.. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఆంధ్రప్రదేశ్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఈసారి ఎక్కువ రోజులపాటు వడగాల్పులు వీయవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ హెచ్చరించారు.