దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇంకా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. అంతేకాకుండా.. వేడిగాలులు విపరీతంగా వీస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో అధికంగా ఉన్నాయి. వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం.. జూన్ 16 నుండి 18 వరకు ఉత్తరప్రదేశ్‌లోని చాలా ప్రాంతాలలో హీట్ వేవ్ నుండి తీవ్రమైన హీట్ వేవ్ వచ్చే అవకాశం ఉందని తెలిపింది.
Yellow Alert: నైరుతి రుతుపవనాల విస్తరణతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి.
దేశ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. దీంతో ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో వాతావరణం కూల్ కూల్‌గా మారిపోయింది. ఇక ఆయా రాష్ట్రాల్లో అయితే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.
నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మిగిలిన భాగాలు, కర్ణాటకలోని మిగిలిన భాగాలు, దక్షిణ మహారాష్ట్ర, తెలంగాణ & కోస్తాంధ్ర మరికొన్ని ప్రాంతాల్లో మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. రాయలసీమ మరియ పరిసర ప్రాంతాల్లో ఒక ఆవర్తనం, కోస్తా కర్ణాటక ప్రాంతంలో మరొక ఆవర్తనం విస్తరించి ఉందన్నారు.
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎండలు మండుతున్నాయి. రాష్ట్రం లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ లో నమోదయ్యాయి. భానుడి భగభగలకు తోడు ఉక్కపోతతో జనాలు నానా అవస్థలు పడుతున్నారు.
ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా సాధారణ రుతుపవనాలు ముందే వస్తున్నాయి.. దీని వల్ల ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని రాష్ట్రాల్లో రుతుపవనాల ప్రభావం తక్కువగా ఉండవచ్చని ఐఎండీ అధికారులు చెప్పుకొచ్చారు.
'రెమాల్' తుఫాను తీవ్ర తుఫానుగా మారింది. ఆదివారం అర్ధరాత్రి పశ్చిమ బెంగాల్లోని సాగర్ ద్వీపం, బంగ్లాదేశ్లోని ఖేపుపరా మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది. మరోవైపు తీవ్ర తుపాను 'రెమల్' హెచ్చరికల మధ్య కోల్కతాలో వర్షం ప్రారంభమైంది. ఈ మేరకు వాతావరణ శాఖ సమాచారం ఇచ్చింది. ముందస్తు రుతుపవనాల సీజన్‌లో బంగాళాఖాతంలో తుఫాను రావడం ఇదే తొలిసారి. భారత వాతావరణ శాఖ (IMD) ఆదివారం విడుదల చేసిన సమాచారం ప్రకారం.. 'రెమల్' ఉత్తర బంగాళాఖాతం, ఖేపుపారాకు 220…