‘రెమాల్’ తుఫాను తీవ్ర తుఫానుగా మారింది. ఆదివారం అర్ధరాత్రి పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపం, బంగ్లాదేశ్‌లోని ఖేపుపరా మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది. మరోవైపు తీవ్ర తుపాను ‘రెమల్’ హెచ్చరికల మధ్య కోల్కతాలో వర్షం ప్రారంభమైంది. ఈ మేరకు వాతావరణ శాఖ సమాచారం ఇచ్చింది. ముందస్తు రుతుపవనాల సీజన్‌లో బంగాళాఖాతంలో తుఫాను రావడం ఇదే తొలిసారి. భారత వాతావరణ శాఖ (IMD) ఆదివారం విడుదల చేసిన సమాచారం ప్రకారం.. ‘రెమల్’ ఉత్తర బంగాళాఖాతం, ఖేపుపారాకు 220 కి.మీ దక్షిణ-ఆగ్నేయంగా.. సాగర్‌కు 210 కి.మీ దక్షిణ-ఆగ్నేయంగా తీవ్ర తుఫానుగా మారింది.
ఇది మరింత బలపడి ఈరోజు అర్ధరాత్రి నాటికి సాగర్ ద్వీపం, ఖేపుపరా మధ్య పశ్చిమ బెంగాల్ మరియు పక్కనే ఉన్న బంగ్లాదేశ్ తీరాలను దాటుతుందని అంచనా వేస్తున్నట్లు IMD తెలిపింది. ఈ సమయంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, వాటి వేగం గంటకు 135 కిలోమీటర్ల వరకు ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. తుఫాను సాయంత్రానికి తీరానికి చేరుకోవచ్చని.. ఈ క్రమంలో, పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశాలోని కోస్తా జిల్లాల్లో ఆదివారం అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు కూడా మే 27-28 తేదీలలో చాలా భారీ వర్షపాతం నమోదైంది.
IPL 2024 Final : ఆరంజ్ ఆర్మీకి స్పెషల్ విషెస్ తెలియజేసిన టాలీవుడ్ స్టార్స్..
తుఫాను పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీర ప్రాంతాలకు చేరుకున్నప్పుడు, 1.5 మీటర్ల ఎత్తులో తుఫాను అలల కారణంగా లోతట్టు ప్రాంతాలలో వరదలు వచ్చే అవకాశం ఉంది. మత్స్యకారులు సోమవారం ఉదయం వరకు ఉత్తర బంగాళాఖాతంలో సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ కేంద్రం సూచించింది. అంతేకాకుండా.. పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ మరియు ఉత్తర 24 పరగణాల తీరప్రాంత జిల్లాలలో మే 26-27 వరకు ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. ఇక్కడ కొన్ని ప్రాంతాలలో చాలా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో పాటు గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్న కోల్‌కతా, హౌరా, నదియా, తూర్పు మేదినీపూర్ జిల్లాల్లో మే 26-27 వరకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేశారు. గంటకు 100 కి.మీ వేగంతో గాలులు వీచనున్నాయి.
తుఫాను హెచ్చరిక కారణంగా.. దక్షిణ 24 పరగణాలకు చెందిన సీల్దా మరియు నమ్‌ఖానా, ఉత్తర 24 పరగణాలకు చెందిన కక్‌ద్వీప్, సీల్దా-హస్నాబాద్ మధ్య అనేక లోకల్ సబర్బన్ రైలు సేవలు ఆదివారం అర్ధరాత్రి, సోమవారం ఉదయం మధ్య రద్దు చేశారు. తుఫాను రమల్ గురించి తూర్పు రైల్వే CPRO కౌశిక్ మిత్రా మాట్లాడుతూ, “మేము తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాము. వాతావరణ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాము. తక్షణ ప్రతిస్పందనను అందించడానికి మేము వివిధ ప్రదేశాలలో అధికారులు, సిబ్బంది కోసం శిబిరాలు ఏర్పాటు చేసాము. పంపింగ్ స్టేషన్లు పనిచేస్తున్నాయి, అదనపు వాహనాలు సిద్ధంగా ఉన్నాయి. ముందుజాగ్రత్తగా హోర్డింగ్‌లు తొలగించబడ్డాయి, కొన్ని రైళ్లు రద్దు” చేశామని తెలిపారు.
Hyderabad Rains : హైదరబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం..
రెమాల్ తుపాను ప్రభావం దృష్ట్యా ఆదివారం మధ్యాహ్నం నుంచి 21 గంటల పాటు విమాన సర్వీసులను నిలిపివేయాలని కోల్‌కతా విమానాశ్రయ అధికారులు నిర్ణయించారు. ఫ్లైట్ సస్పెన్షన్ వ్యవధిలో అంతర్జాతీయ, దేశీయంగా మొత్తం 394 విమానాలు వచ్చే, బయలుదేరే విమానాలు, విమానాల సస్పెన్షన్ వ్యవధిలో విమానాశ్రయం నుంచి బయటికి వెళ్లవని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ప్రతినిధి తెలిపారు. మే 26-27 తేదీల్లో ఉత్తర ఒడిశాలోని బాలాసోర్, భద్రక్ మరియు కేంద్రపారా తీరప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని.. మయూర్‌భంజ్‌లో కూడా మే 27న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ, ఉత్తర 24 పరగణా జిల్లాలలో వరదలు, బలహీనమైన నిర్మాణాలు, విద్యుత్, కమ్యూనికేషన్ లైన్లు, చదును చేయని రోడ్లు, పంటలు, తోటలకు భారీ నష్టం వాటిల్లుతుందని IMD హెచ్చరించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్లలోనే ఉండాలని వాతావరణ అధికారులు సూచించారు.