Mohan Babu: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట విషాదం చోటుచేసుకున్న విషయం తెల్సిందే. ఇళయరాజా కుమార్తె 47 ఏళ్ల భవతరిణి క్యాన్సర్ తో పోరాడుతూ శ్రీలంకలో కన్నుమూయడం హాట్ టాపిక్ అవుతోంది. ఆమె మరణంతో ఇళయరాజా తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయారు. ఇక కూతురు మరణాన్ని తట్టుకోలేక మ్యూజిక్ మ్యాస్ట్రో కొన్నిరోజులు తన ప్రాజెక్ట్స్ మొత్తాన్ని స్టాప్ చేశారు.
Bhavatharini: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట తీవ్ర విషాదం నెలకున్న విషయం తెల్సిందే.. ఆయన కుమార్తె భవతారణి తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె శ్రీలంకలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటూ మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక భవతరణి మృతి పట్ల సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు, ఇళయరాజా అభిమానులు ఆమెకు సంతాపం ప్రకటించారు.
నాగచైతన్య, కృతిశెట్టి జంటగా నటిస్తున్న 'కస్టడీ' మూవీ కోసం ఓ పాటను అన్నపూర్ణ స్టూడియోస్ లో చిత్రీకరిస్తున్నారు. దీని కోసం ఏకంగా ఏడు సెట్స్ నిర్మించినట్టు నిర్మాత శ్రీనివాస చిట్టూరి తెలిపారు.
దిగ్గజ స్వరకర్త ఇళయరాజా, ప్రముఖ సినీ నిర్మాత విజయేంద్ర ప్రసాద్ బుధవారం రాజ్యసభకు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. నామినేషన్ల అనంతరం ప్రతిష్టాత్మకంగా నిలిచిన కళాకారులకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. రాజ్యసభకు అర్హులైన ప్రముఖులను ఎంపిక చేసినందుకు ప్రధాని మోదీకి మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్‌లో కృతజ్ఞతలు తెలిపారు. సినిమా పరిశ్రమకు చెందిన అత్యంత అర్హులైన ప్రముఖులైన కె.వి.విజయేంద్ర ప్రసాద్, ఇళయరాజాలకు రాజ్యసభ సభ్యులుగా రాష్ట్రపతి నామినేషన్‌కు అర్హమైన గౌరవాన్ని అందించినందుకు గౌరవప్రదమైన ప్రధాన మంత్రి…
పెద్దల సభకు నలుగురు ప్రముఖులను ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం.. ఆ నలుగురు దక్షిణాది ప్రముఖులు కావడం మరో విశేషం.. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాను, ప్రముఖ అథ్లెట్ పీటీ ఉషాను, దర్శకధీరుడు రాజమౌళి తండ్రి, ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు విజేయంద్రప్రసాద్, వీరేంద్ర హెగ్డేను రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ చేసింది కేంద్రం.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోడీ.. వారి ప్రత్యేకతలను.. వారిని ఏ కేటగిరిలో నామినేట్ చేసిన…
అక్కినేని నాగ చైతన్య తన 22వ సినిమా కోసం ఏస్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో చేతులు కలిపారు. తెలుగు, తమిళ భాషల్లో రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్, ఫస్ట్-క్లాస్ టెక్నికల్ స్టాండర్డ్స్‌తో ఈ చిత్రం గ్రాండ్‌గా రూపుదిద్దుకోనుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించనున్నారు. కృతిశెట్టి ఈ చిత్రంలో నాగ చైతన్యకి జోడిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దిగ్గజ సంగీత దర్శకులైన తండ్రీ కొడుకులు ఇసైజ్ఞాని…
మ్యాస్ట్రో ఇళయరాజా సంగీత సారథ్యంలో శర్మన్ జోషి, శ్రియా శరన్ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘మ్యూజిక్ స్కూల్’. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ మూవీ హైదరాబాద్, గోవా సహా పలు ప్రాంతాల్లో చిత్రీకరణను జరుపుకుంది. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తయ్యింది. ఈ సినిమాలో మొత్తం 11 పాటలున్నాయి. అందులో మూడు పాటలు కేవలం మ్యూజిక్‌తోనే సాగుతాయి. కిరణ్ డియోహన్స్ తన కెమెరా పనితనంతో విజువల్స్‌ను గ్రాండ్‌గా తెరకెక్కించి సినిమాను నెక్ట్స్…
ప్రముఖ ఛాయాగ్రాహకుడు వి. ఎస్. జ్ఞానశేఖర్ తొలిసారి నిర్మాతగా మారి తీసిన సినిమా ‘గమనం’. శ్రియా, నిత్యా మీనన్, శివ కందుకూరి, ప్రియాంక జువాల్కర్, చారుహాసన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. ఈ చిత్రంతో సుజనా రావ్ దర్శకురాలిగా పరిచయం అయ్యారు. విమర్శకుల ప్రశంసలను అందుకున్న ‘గమనం’ తర్వాత జ్ఞానశేఖర్… సుజనారావ్ తోనే మరో సినిమాను నిర్మించబోతున్నారు. కాళీ ప్రొడక్షన్ బ్యానర్ లో జ్ఞానశేఖర్ ఈసారి యాక్షన్ థ్రిల్లర్…
ఏడు వేలకు పైగా పాటలు… 1400 పై చిలుకు సినిమాలు… ఇరవై వేలకు పైగా కాన్సర్ట్స్… ఒకే సంగీత దర్శకుడు సుసాధ్యం చేశారంటే నమ్మశక్యమా!? అవును, నమ్మితీరాలి… ఎందుకంటే ఆ ఫీట్ సాధించిన వారు ఇళయరాజా! కాబట్టి సాధ్యమే అని నమ్మవచ్చు. తన తరం సంగీత దర్శకుల్లో ఇళయరాజా లాగా అభిమానగణాలను సంపాదించిన వారు మరొకరు కానరారు. తెరపై ఇళయరాజా పేరు కనిపించగానే అభిమానుల ఆనందం అంబరమంటేది. దాదాపుగా స్టార్ హీరోల స్థాయిలో ఇళయరాజా పేరు మారుమోగి…