Custody: అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు కాంబినేషన్‌లో రూపొందుతున్న ద్విభాషా చిత్రం ‘కస్టడీ’. ప్రముఖ తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దీనిని తెలుగు, తమిళ భాషల్లో తీస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో లీడ్ పెయిర్ నాగచైతన్య, కృతీశెట్టి పై ఓ పాటను గ్రాండ్ గా చిత్రీకరిస్తున్నారు. ఈ పాట చిత్రీకరణ కోసం ఏకంగా ఏడు విభిన్నమైన భారీ సెట్లు వేశారు. ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్, ఆర్ట్ డైరెక్టర్ డివై సత్యనారాయణ కలిసి అద్భుతమైన ఈ సెట్స్‌ని రూపొందించారు. ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా, లిటిల్ మాస్ట్రో యువన్ శంకర్ రాజా కలిసి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరిస్తున్న పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ డ్యాన్స్ నంబర్ బిగ్ స్క్రీన్‌పై విజువల్ ఫీస్ట్ గా వుండబోతుందని నిర్మాత శ్రీనివాస చిట్టూరి తెలిపారు.
నాగ చైతన్య కెరీర్‌లో అత్యంత ఖరీదైన చిత్రాల్లో ‘కస్టడీ’ ఒకటి అని, అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా రూపొందుతోందని చిత్ర సమర్పకులు పవన్ కుమార్ చెప్పారు. అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. సంపత్ రాజ్, శరత్ కుమార్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీనికి అబ్బూరి రవి డైలాగ్స్ రాస్తుండగా, ఎస్‌ఆర్ కత్తిర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ‘కస్టడీ’ మూవీ మే 12న విడుదల కాబోతోంది.