ప్రముఖ ఛాయాగ్రాహకుడు వి. ఎస్. జ్ఞానశేఖర్ తొలిసారి నిర్మాతగా మారి తీసిన సినిమా ‘గమనం’. శ్రియా, నిత్యా మీనన్, శివ కందుకూరి, ప్రియాంక జువాల్కర్, చారుహాసన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. ఈ చిత్రంతో సుజనా రావ్ దర్శకురాలిగా పరిచయం అయ్యారు. విమర్శకుల ప్రశంసలను అందుకున్న ‘గమనం’ తర్వాత జ్ఞానశేఖర్… సుజనారావ్ తోనే మరో సినిమాను నిర్మించబోతున్నారు. కాళీ ప్రొడక్షన్ బ్యానర్ లో జ్ఞానశేఖర్ ఈసారి యాక్షన్ థ్రిల్లర్…
ఏడు వేలకు పైగా పాటలు… 1400 పై చిలుకు సినిమాలు… ఇరవై వేలకు పైగా కాన్సర్ట్స్… ఒకే సంగీత దర్శకుడు సుసాధ్యం చేశారంటే నమ్మశక్యమా!? అవును, నమ్మితీరాలి… ఎందుకంటే ఆ ఫీట్ సాధించిన వారు ఇళయరాజా! కాబట్టి సాధ్యమే అని నమ్మవచ్చు. తన తరం సంగీత దర్శకుల్లో ఇళయరాజా లాగా అభిమానగణాలను సంపాదించిన వారు మరొకరు కానరారు. తెరపై ఇళయరాజా పేరు కనిపించగానే అభిమానుల ఆనందం అంబరమంటేది. దాదాపుగా స్టార్ హీరోల స్థాయిలో ఇళయరాజా పేరు మారుమోగి…
రైటర్ డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో మోహన్ బాబు నటించి, నిర్మించిన సినిమా ‘సన్ ఆఫ్ ఇండియా’. ఈ నెల 18న ఇది విడుదల కాబోతోంది. ఈ సినిమా కాన్సెప్ట్ గురించి మోహన్ బాబు తెలియచేస్తూ, ఆసక్తి కరమైన విషయాలను వెల్లడించారు. ‘ఓ ఎమ్మెల్యే కారణంగా చేయని తప్పుకు జైలుకు వెళ్ళిన ఓ వ్యక్తి, తనలాంటి అమాయకులు దేశ వ్యాప్తంగా జైళ్ళలో ఎంతమంది ఉన్నారనే విషయమై పరిశోధన చేసి, ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడన్నదే ఈ చిత్ర కథ’ అని…
బొత్స సత్యనారాయణ ఇంటి వివాహ వేడుకలో ఏపీ మంత్రి పేర్ని నానిని తనను కలిశారని, వారి కుటుంబంతో ఉన్న అనుబంధం దృష్ట్యా తన ఇంటికి బ్రేక్ ఫాస్ట్ కు పిలిచానని, దాన్ని కూడా కొందరు చెత్త నా కొడుకులు రాజకీయం చేశారని సీనియర్ నటుడు, నిర్మాత మోహన్ బాబు మండిపడ్డారు. మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఆయన నటించిన ‘సన్నాఫ్ ఇండియా’ చిత్రం ఈ నెల 18న విడుదల కాబోతున్న నేపథ్యంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా…
సీనియర్ హీరో మోహన్ బాబు “సన్ ఆఫ్ ఇండియా”తో థియేటర్లలో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్నారు. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో నిజ జీవిత సంఘటల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 18న సినిమా హాళ్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం మేకర్స్ సినిమా ప్రొమోషన్లపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే నిన్న “సన్ ఆఫ్ ఇండియా” ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. Read Also : Son of India : అలీపై షాకింగ్ కామెంట్స్… సునీల్…
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం “సన్ ఆఫ్ ఇండియా”. మంచు విష్ణు నిర్మాణంలో నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 18న విడుదల కానుంది. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. “సన్ ఆఫ్ ఇండియా” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్రం బృందంతో పాటు మంచు లక్ష్మి, మంచు విష్ణు, పోసాని కృష్ణ మురళి, అలీ, సునీల్…
సిబి సత్యరాజ్, తాన్యా రవిచంద్రన్, దాతో రాధా రవి కీలకపాత్రల్లో కిషోర్ ఎన్ రూపొందిస్తున్న చిత్రం “మాయోన్”. నిధి కోసం వెళ్ళే యువకుల టీంకు అడవిలో ఎదురయ్యే ప్రమాదాలు, ధైర్య సాహసాలతో కూడిన అడ్వెంచరస్ మూవీ ఇది. దేవాలయాల రహస్యం ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం సమకూరుస్తున్నారు. ఈ మిస్టరీ థిల్లర్ షూటింగ్ పూర్తయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఆసక్తికర చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ…
యామిని ఫిలింస్ నిర్మించనున్న కొత్త చిత్రం మ్యూజిక్ స్కూల్. తెలుగు, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చబోతున్నారు. బ్రాడ్ వే కొరియోగ్రాఫర్ ఆడమ్ ముర్రే కొరియోగ్రఫీ అందిస్తున్నారు. పాపారావు బియ్యాల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో శర్మన్ జోషి, శ్రియా శరన్, సుహాసిని ములే, బెంజిమిన్ గిలాని, ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, వినయ్ వర్మ, గ్రేసీ గోస్వామి, ఓజూ బారువా ప్రధాన పాత్రలు పోషించబోతున్నారు. ‘జోధా అక్బర్’ వంటి చిత్రాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన…
(జూలై 18న ‘ఆదిత్య 369’కు 30 ఏళ్ళు పూర్తి) నటసింహ నందమూరి బాలకృష్ణ కెరీర్ లో అనేక అద్భుత విజయాలు ఉన్నాయి. అయితే ఆయన కెరీర్ లోనే కాదు, యావత్ భారతీయ చిత్రసీమలోనే ఓ అపురూపం అనదగ్గ చిత్రం ‘ఆదిత్య 369’. మన దేశంలో తొలి టైమ్ మిషన్ మూవీగా ‘ఆదిత్య 369’ తెరకెక్కింది. ‘బ్యాక్ టు ది ఫ్యూచర్’ అనే చిత్రం స్ఫూర్తితో ఈ సినిమా రూపొందినా, ఎక్కడా ఆ సినిమాను కాపీ కొట్టింది లేదు.…