సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, గీత రచయిత పెద్దాడ మూర్తి అనారోగ్యంతో కన్నుమూశారు. పలు పత్రికలలో జర్నలిస్ట్ గా పనిచేసిన ఆయన తమ్మారెడ్డి భరద్వాజ 'కూతురు' చిత్రంతో సినీ గీత రచయితగా తొలి అడుగువేశారు. రెండున్నర దశాబ్దాల కాలంలో వందలాది చిత్రాలకు పాటలు రాశారు.
(ఆగస్టు 22న ‘ఇడియట్’కు 20 ఏళ్ళు) ‘మాస్ మహరాజా’గా నేడు సాగుతున్న రవితేజకు స్టార్ డమ్ తీసుకు వచ్చిన చిత్రం ‘ఇడియట్’. అంతకు ముందు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందిన ‘ఇట్లు శ్రావణీసుబ్రమణ్యం’ జనాన్ని భలేగా ఆకట్టుకుంది. ఆ తరువాత వారిద్దరి కాంబోలో వచ్చిన చిత్రం ‘ఇడియట్’. అందువల్ల మొదటి నుంచీ ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. పైగా పూరి జగన్నాథ్ ఇదే కథతో కన్నడలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా ‘అప్పు’…