Idiot Movie Completed 20 Years: ఇరవై ఏళ్ళ ‘ఇడియట్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(ఆగస్టు 22న ‘ఇడియట్’కు 20 ఏళ్ళు)
‘మాస్ మహరాజా’గా నేడు సాగుతున్న రవితేజకు స్టార్ డమ్ తీసుకు వచ్చిన చిత్రం ‘ఇడియట్’. అంతకు ముందు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందిన ‘ఇట్లు శ్రావణీసుబ్రమణ్యం’ జనాన్ని భలేగా ఆకట్టుకుంది. ఆ తరువాత వారిద్దరి కాంబోలో వచ్చిన చిత్రం ‘ఇడియట్’. అందువల్ల మొదటి నుంచీ ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. పైగా పూరి జగన్నాథ్ ఇదే కథతో కన్నడలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా ‘అప్పు’ చిత్రం తెరకెక్కించారు. కన్నడనాట ‘అప్పు’ అఖండ విజయం సాధించింది. ఆ సినిమా విడుదలైన నాలుగు నెలలలోపే ‘ఇడియట్’ తెలుగునాట విడుదలై విజయఢంకా మోగించడం విశేషం! 2002 ఆగస్టు 22న ‘ఇడియట్’ విడుదలయిన ‘ఇడియట్’కు “ఓ చంటిగాడి ప్రేమకథ” అనే ట్యాగ్ ఉంది.
‘ఇడియట్’ కథ ఏమిటంటే – కానిస్టేబుల్ వెంకటస్వామి కొడుకు చంటిగాడు డిగ్రీ చదువుతూ ఏదీ పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటాడు. తన కాలేజ్ లోనే చదివే సుచిత్రను చూసి మనసు పారేసుకుంటాడు. ఆమె మంచి మనసు తెలుసుకొని మరింతగా పొంగిపోతాడు. సుచిత్ర పోలీస్ కమీషనర్ విప్రనారాయణ కూతురు అని తెలుస్తుంది. అయినా చంటిగాడు లోకల్ అంటూ భయపడకుండా సుచిని ప్రేమిస్తాడు. మొదట్లో కాదనుకున్నా, తరువాత చంటి మనసు తెలిసి సుచిత్ర కూడా ప్రేమిస్తుంది. ఇద్దరూ గాఢంగా ప్రేమించుకుంటారు. ఈ విషయం తెలిసిన పోలీస్ కమీషనర్ చంటికి వార్నింగిస్తాడు. తరువాత సెల్ లో వేసి తంతాడు. ఆ పై చంపే ప్రయత్నమూ చేస్తాడు. అయినా చలించని చంటిని చూసి తండ్రి వెంకటస్వామి భయపడిపోతాడు. తమ ఇంటికి వచ్చిన సుచిని వెంకటస్వామి, కమీషనర్ వచ్చి తీసుకుపోతే వెళ్లనివ్వమని చెబుతాడు. చంటి, తెలివిగా సుచిని ఇంట్లోంచి తీసుకు వచ్చి, డీజీపీ ఆఫీసు ముందరే తన మిత్రుల సహకారంతో పెళ్ళి చేసుకుంటాడు. మేజర్స్ అయిన వారి ప్రేమను డీజీపీ కూడా ఆశీర్వదిస్తాడు. వారి ప్రేమను అడ్డుకున్న కమీషనర్ నారాయణను సస్పెండ్ చేస్తాడు. చివరలో చంటి సివిల్స్ పాసై ఐపీయస్ కు సెలెక్ట్ అవుతాడు. దాంతో కథ సుఖాంతమవుతుంది.
Also Read
- Anirudh Ravichander: లైఫ్ ఇచ్చిన ధనుష్‌నే మర్చిపోయావా అనిరుధ్? 15 ఏళ్ల నోట్‌పై ఫ్యాన్స్ ఫైర్!
- Sita in Ramayana: సీత యోధురాలే.. ఆ సాక్ష్యంతో విమర్శకుల నోళ్లు మూయించిన డైరెక్టర్ నితీష్ తివారి..!
- Rashmika-Mysaa: కల్యాణి ప్రియదర్శన్ రికార్డుపై రష్మిక కన్ను.. ‘మైసా’తో చరిత్ర సృష్టిస్తుందా?
- Death Threat: బిగ్ బీ కుటుంబానికి మరో బిగ్ వార్నింగ్.. అమితాబ్, అభిషేక్‌లను టార్గెట్ చేశామంటూ గ్యాంగ్‌స్టర్ సంచలనం.!
హీరోయిన్ రక్షిత ‘ఇడియట్’ ద్వారానే తెలుగు చిత్రసీమకు పరిచయం అయింది. ప్రకాశ్ రాజ్, కోట శ్రీనివాసరావు, సంగీత, గిరిబాబు, జీవా, ఆలీ, పృథ్వీరాజ్, విద్యావతి, శ్రీరామ్ శంకర్, శ్రీనివాసరెడ్డి, ఎమ్మెస్ నారాయణ, నర్సింగ్ యాదవ్ నటించిన ఈ చిత్రంలో కైకాల సత్యనారాయణ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే , నిర్మాత, దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్వహించారు. చక్రి స్వరకల్పన చేయగా, కందికొండ, భాస్కరభట్ల, పెద్దాడ మూర్తి పాటలు రాశారు. ఇందులోని “చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే…”, “జై వీరాంజనేయా…”, “సై రా సై…”,”చెలియా చెలియా…”,”లే లేత నవ్వులా…”,” ఈ రోజే…” అంటూ సాగే పాటలు అలరించాయి. సిహెచ్ పద్మావతి సమర్పణలో వైష్ణో అకాడమీ పతాకంపై రూపొందిన ‘ఇడియట్’ చిత్రానికి యమ్.ఎల్. కుమార్ చౌదరి నిర్వహణ వహించారు. ఈ సినిమా ఘనవిజయం సాధించింది. 30కి పైగా కేంద్రాలలో శతదినోత్సవం చూసింది.
Gokulamlo Seeta: పాతికేళ్ళ ‘గోకులంలో సీత’
తాజావార్తలు
-
Anirudh Ravichander: లైఫ్ ఇచ్చిన ధనుష్‌నే మర్చిపోయావా అనిరుధ్? 15 ఏళ్ల నోట్‌పై ఫ్యాన్స్ ఫైర్!
-
Rachin Ravindra: టీ20, వన్డే సిరీస్‌లు కోల్పోయాం.. టెస్టులో అలా ఉండదు.. భారత్‌ను దెబ్బ కొడతాం..
-
Airport Security: ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ నుంచి CISF సిబ్బంది తగ్గింపు.. వారి స్థానంలో..
-
MS Dhoni: IPLకు వీడ్కోలు పలికిన ఎంఎస్ ధోని.. గురువుగా సరికొత్త అవతారం..
-
GTA 6 Pre-Orders: ఆడకముందే రూ. 11,000 కోట్లు.. రిలీజ్‌కు ముందే GTA 6 ఊచకోత! అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..