Aadhaar card: భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు ఆధార్ కార్డును ఐడెంటిటీ ప్రూఫ్‌గా పరిగణించాల్సిందేనని ఎన్నికల కమిషన్‌కు ఆదేశించింది. ఈ నిర్ణయంతో ప్రజలకు ఎన్నికల సమయంలో తమ గుర్తింపు సులభంగా నిరూపించుకునే అవకాశం కలగబోతుంది. సుప్రీంకోర్టు ఈ ఆదేశాన్ని ఇవ్వడానికి గల ముఖ్య కారణం.. ప్రస్తుతం ఆధార్ కార్డు దేశంలో అత్యంత నమ్మదగిన గుర్తింపు పత్రంగా ఉండడమే. ప్రభుత్వానికి, ప్రజలకు అనేక సేవలు అందించడంలో ఆధార్ కీలక పాత్ర పోషిస్తోంది. కానీ, ఇప్పటివరకు ఎన్నికల సమయంలో…
అత్యవసరంగా తన పిటిషన్ ను విచారించాలని లాయర్ అశ్వినీ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టును కోరారు. అయితే.. దీనిని అత్యవసర విచారణకు అంగీకరించబోమని సుప్రీంకోర్టు ఇవాళ తెల్చి చెప్పేసింది.
Rs.2000 Note Withdrawn: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రూ. 2000 నోట్లను ఉపసంహరించుకుంది. ప్రజలు నోట్లను మార్చుకోవడానికి నాలుగు నెలల సమయం ఇచ్చింది. సెప్టెంబర్ 30 వరకు అన్ని బ్యాంకుల్లో రూ.2000 నోట్లను మార్చుకోవచ్చని తెలిపింది. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థలో రూ.2000 నోటు చలామణి దాదాపుగా తగ్గిపోయింది. కేవలం 10 శాతం నోట్లు మాత్రమే చలామణీలో ఉన్నట్లు వెల్లడించింది.