ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా T20 లీగ్స్ దర్శనమిస్తున్నాయి. ఐపీఎల్ సక్సెస్ తరువాత దాదాపు ప్రతి దేశం ఈ లీగ్స్ ని జరుపుతున్నాయి. ఇక ఇండియాలో అయితే ప్రతి స్టేట్, వాళ్ళ ప్లేయర్లను పరిచయం చేయటానికి లీగ్స్ నిర్వహిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఇంటర్నేషనల్ లీగ్స్ ఏకంగా 25 పైనే ఉన్నాయి. అయితే ఒక్కప్పుడు టీ20 ఛాంపియన్స్ లీగ్ అనే ఒక లీగ్ ఉండేది. అది కేవలం ఐపీఎల్, బిగ్ బాష్ లీగ్, ఇంగ్లాండ్ కౌంటీల్లో టాప్ 2 టీమ్స్ అంటే విన్నర్, రన్నర్స్ మాత్రమే ఆడేవి. ఇలా T20 లీగుల్లో టాప్ 2 టీమ్స్ ఆడేవి. కానీ ఆ తర్వాత ఈ లీగ్ ను నిర్వహించటం ఆపేశారు. దీనికి కారణం, ప్రతి టీం విదేశీ టూర్లతో బిజీగా మారిపోవడంతో పాటు ఐపీఎల్ డామినేషన్ పెరగడం. ఇక చివరగా ఈ లీగ్ 2014లో జరిగింది. ఆ తరువాత ఈ లీగ్ నిర్వహించటానికి సాధ్యపడలేదు. అయితే ఇప్పుడు ఇదే లీగ్ మళ్ళీ నిర్వహించటానికి ప్లాన్ చేస్తున్నారు.
READ MORE: Shocking : చిన్నారి వాంతిలో కదులుతున్న పరుగులు.. నెలరోజులుగా ఇదే తంతు
వరల్డ్ క్లబ్ T20 ఛాంపియన్షిప్ పేరిట ఒక లీగ్ ను 2026 నుంచి నిర్వహించబోతున్నారు. ఇందులో ఐపీఎల్, బిగ్ బాష్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్, ది హండ్రెడ్, SA T20 లీగ్స్ లో ఛాంపియన్స్ గా నిలిచిన జట్లు తలపడతాయి. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 20 లీగ్స్ నుంచి Title విన్నర్ జట్లను తీసుకుంటారు. వారందరూ ఇక్కడ మరోసారి తలపడతారు. ఇప్పటివరకు డొమెస్టిక్ స్థాయిలో ఉన్న టాలెంటును గ్లోబల్ స్టేజి మీద ప్రదర్శించటానికి మంచి వేదిక అవుతుంది. ఇక ఈ విషయంపై ఇప్పటికే బీసీసీఐ, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్, ఐసీసీ ఛైర్మెన్ జైషా దగ్గర ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ లీగ్ పై అన్ని పాజిటివ్ గానే కనపడుతున్నాయి. ఇదిలా ఉండగా ఇంగ్లాండ్ ఇకపై హండ్రెడ్ లీగ్ లో విన్నర్ గా నిలిచిన జట్టునే పంపనుంది. అంతకుముందు ఛాంపియన్స్ లీగ్ టైంలో T20 బ్లాస్ట్ టైటిల్ విన్నర్ జట్టునే పంపేవారు. అయితే ఇప్పుడు ఆ జట్లను కాకుండా హండ్రెడ్ లీగ్ టైటిల్ విజేతను పంపనున్నట్లు తెలుస్తోంది. ఇక ఐపీఎల్ 2025లో ఆర్సీబీ జట్టు మొదటిసారిగా ఛాంపియన్స్ గా అవతరించినట్లు తెలిసిందే.
కాగా.. మొదట 2009లో ప్రారంభమైన చాంపియన్స్ లీగ్, 2014 వరకు నడిచింది. అయితే 2015లో టెలివిజన్ రేటింగులు తక్కువగా ఉండటం, స్పాన్సర్షిప్ స్ట్రగుల్స్ (sponsorship struggles) కారణంగా ఈ లీగ్ ను రద్దు చేశారు. ఇక ఈ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ రెండు టైటిళ్లతో అత్యంత విజయవంతమైన జట్లుగా కూడా నిలిచాయి.
READ MORE: Thummala Nageswara Rao: రాష్ట్రంలో యూరియా కొరత.. మరోమారు కేంద్రానికి లేఖ రాసిన మంత్రి తుమ్మల..!