4-Day Tests: నాలుగు రోజుల టెస్ట్‌లకు ఐసీసీ గ్రీన్ సిగ్నల్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
4-Day Tests: ప్రపంచ క్రికెట్‌ను ఏలుతున్న వన్డేలు, టి20లు మధ్య టెస్టు ఫార్మాట్‌పై వివిధ దేశాల్లో ఆసక్తి తగ్గుతుండగా.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2027-29 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) సైకిల్ లో భాగంగా చిన్న దేశాలకు నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్‌లను అనుమతించడానికి ఐసీసీ సిద్ధమైందని ఓ నివేదిక వెల్లడించింది. అయితే ఇందులో భారతదేశం, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లకు మాత్రం ఐదు రోజుల టెస్ట్ లకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
Read Also: Air India: బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్లలో సమస్య.. ఒకే రోజు లండన్, పారిస్ విమానాలు రద్దు..
Also Read
- 12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
- October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
- Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
- Truecaller Scam Checker: ఆన్లైన్ స్కామ్‌లకు చెక్ పెట్టేందుకు Truecaller కొత్త ఫీచర్.. నంబర్, లింక్, మెసేజ్ అన్నీ ఒకేచోట చెక్..
ఈ ఏడాది లార్డ్స్ వేదికగా జరిగిన WTC ఫైనల్ సందర్భంగా జరిగిన చర్చల్లో ఐసీసీ చైర్మన్ జైషా, నాలుగు రోజుల టెస్టుల పట్ల తన మద్దతు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నిర్ణయాన్ని 2027-29 టెస్ట్ ఛాంపియన్‌షిప్ కోసం అధికారికంగా తీసుకొచ్చే అవకాశం ఉంది. చిన్న దేశాలు ఎక్కువ రోజులు టెస్టులు నిర్వహించలేవని, వ్యయ భారం ఎక్కువ అవుతుందని భావిస్తూ టెస్టులకు దూరంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల టెస్టులు ఉండడం వల్ల మూడు టెస్టుల సిరీస్ ను మూడు వారాల్లో పూర్తి చేయడం సాధ్యమవుతుంది. ఇది ఆయా దేశాలకు అన్ని విధాలుగా సరిపోతుందని ఐసీసీ అభిప్రాయం.
అయితే, నాలుగు రోజుల టెస్టుల్లో ప్రతిరోజూ కనీసం 98 ఓవర్లు జరగాల్సిందిగా నిబంధన ఉండేలా గేమ్ ప్లే హవర్స్‌ను పొడిగించనున్నట్లు సమాచారం. ఇలా రోజులో జరిగే ఓవర్ల సంఖ్యను పెంచి, ఒక రోజు తక్కువ అయినా మ్యాచ్ సమగ్రంగా జరగేలా చేస్తుంది. ఈ కొత్త నిబంధనల్లో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మాత్రం ప్రత్యేక మినహాయింపుతో ఐదు రోజుల టెస్టులు కొనసాగించనున్నారు. ముఖ్యంగా యాషెస్ (ఇంగ్లండ్-ఆస్ట్రేలియా), బోర్డర్-గావాస్కర్ ట్రోఫీ (భారత్-ఆస్ట్రేలియా), అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ (భారత్-ఇంగ్లండ్) లాంటి కీలక సిరీస్ లు మాత్రం ఐదు రోజుల గానే ఉంటాయి.
Read Also: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. రేవంత్, ఈటల, రఘునందన్ టార్గెట్!
ఐసీసీ 2017 నుంచే ద్వైపాక్షిక సిరీస్ లలో నాలుగు రోజుల టెస్టులుకు అనుమతి ఇచ్చింది. ఇంగ్లండ్ ఇటీవల జింబాబ్వేతో నాలుగు రోజుల టెస్ట్ ను ట్రెంట్ బ్రిడ్జ్ లో ఆడింది. అంతకుముందు 2019, 2023లో ఐర్లాండ్‌తోనూ నాలుగు రోజుల టెస్ట్‌లు జరిగాయి. అయితే, 2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్ ఇప్పటికే షెడ్యూల్ అయినందున అన్ని మ్యాచ్‌లు ప్రస్తుత ఐదు రోజుల టెస్ట్ ఫార్మాట్‌లోనే కొనసాగుతాయి. ఈ సైకిల్‌లో మొత్తం 27 టెస్ట్ సిరీస్‌లు ఉండగా.. అందులో 17 సిరీస్‌లు రెండు మ్యాచ్‌లతో, 6 సిరీస్‌లు మూడు మ్యాచ్ లతో ఉంటాయి. వీటితోపాటు భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఈ సైకిల్‌లో ఒక్కో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను ఒకరికొకరు ఆడతారు.
తాజావార్తలు
-
Share Nani Tag: ఒక్క సినిమాకే సరిపోయింది.. మళ్లీ ‘నేచురల్ స్టార్’గానే నాని!
-
12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Bloody Romeo : నాని సరసన నాజూకు బ్యూటీ..
-
Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
ట్రెండింగ్
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!