Asad Rauf: మాజీ అంపైర్ అసద్ రౌఫ్ గుండెపోటుతో హఠాన్మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Former Umpire Asad Rauf Dies Due To Cardiac Arrest: పాకిస్తాన్‌కు చెందిన ఐసీసీ మాజీ అంపైర్ అసద్ రౌఫ్ (66) కన్నుమూశారు. గురువారం (సెప్టెంబర్ 15) గుండెపోటుతో ఆయన హఠాన్మారణం పొందారు. ఈ విషయాన్ని ఆయన సోదరుడు తాహిర్ రౌఫ్ స్పష్టం చేశారు. లాహోర్‌లోని లాండా బజార్‌లో ఓ బట్టల దుకాణం నిర్వహిస్తున్న అసద్ రౌఫ్.. ఎప్పట్లాగే బుధవారం రాత్రి దుకాణం మూసేసి ఇంటికి వెళ్లాడు. ఇంటికెళ్లాక ఛాతీలో నొప్పి రావడంతో.. అనకు అసౌకర్యంగా ఉందని చెప్పారు. అప్పుడు కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. ఆయన తుదిశ్వాస విడిచారు. అసద్ రౌఫ్ హఠాన్మరణంతో క్రికెట్‌లో విషాదం నెలకొంది. పాకిస్తాన్ క్రికెటర్లతో పాట అంతర్జాతీయంగా ఇతర ఆటగాళ్లు సైతం ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు.
పాకిస్తాన్‌లో అలీమ్ దార తర్వాత అత్యంత విజయవంతమైన అంపైర్‌గా పేరు గడించిన అసద్ రౌఫ్.. 1998లో అంపైరింగ్ తన ప్రయాణాన్ని ప్రారంభించారు. 2000లో పాకిస్తాన్-శ్రీలంక మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. 2006లో ఐసీసీ ఇలైట్ ప్యానెల్ ఆఫ్ అంపైర్‌లలో చేర్చబడ్డారు. అంతర్జాతీయ క్రికెట్‌లో 170కి పైగా మ్యాచ్‌లకు అంపైరింగ్ నిర్వహించారు. ఇందులో 64 టెస్టులు (49 టెస్టులు ఆన్‌ఫీల్డ్ అంపైర్‌గా, 15 మ్యాచ్‌లు టీడీ అంపైర్‌గా), 139 వన్డేలు, 28 టీ20 మ్యాచ్‌లు ఉన్నాయి. ఐపీఎల్ మ్యాచ్‌లకు కూడా అంపైరింగ్‌గా చేశాడు. అయితే.. 2013 ఐపీఎల్ సీజన్‌లో స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం ఆయన మెడకు చుట్టుకుంది. ఆయన స్పాట్ ఫిక్సింగ్‌గా పాల్పడ్డారని, బుకీల నుంచి బహుమతుల్ని స్వీకరించారని ఆరోపణలు వచ్చాయి. అప్పుడు బీసీసీఐ వెంటనే ఆయన్ను పక్కన పెట్టి.. విచారణకు ఆదేశించింది.
Also Read
- Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
- Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
ఈ ఫిక్సింగ్‌పై సుధీర్ఘ విచారణ జరిగిన అనంతరం.. 2016లో అసద్ రౌఫ్ దోషిగా తేలారు. దాంతో బీసీసీఐ ఆయనపై ఐదేళ్లపాటు నిషేధం విధించింది. నిషేధం ముగిసిన తర్వాత రీఎంట్రీ ఇచ్చేందుకు ఆస్కారం ఉన్నప్పటికీ.. అసద్ రౌఫ్ మాత్రం అందుకు ఇష్టపడలేదు. అంపైరింగ్‌కు గుడ్ బై చెప్పేసి.. లాహోర్‌లోనే ఒక బట్టల షాపు పెట్టుకున్నారు. అసద్ రౌఫ్ అంపైర్‌గానే కాదు.. పాకిస్థాన్‌లో ఫస్ట్-క్లాస్ క్రికెటర్‌గా కూడా తనదైన ముద్రవేశారు. 71 ఫస్ట్ క్లాస్, 40 లిస్ట్ ఏ మ్యాచ్‌లలో మూడు సెంచరీలు, 26 అర్ధ సెంచరీల సహాయంతో 3423, 611 పరుగులు చేశారు.
తాజావార్తలు
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!