ప్రపంచం లో ఫుట్ బాల్ తర్వాత అంత క్రేజ్ ఉన్న ఆట అంటే క్రికెట్. అయితే అటువంటి క్రికెట్ ను ఒలంపిక్స్ లో చేర్చాలి అని కామెంట్స్ అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఈ వ్యాఖ్యలను సమర్ధించాడు. ప్రస్తుతం అబుదాబి లో జరుగుతున్న టీ 10 లీగ్ లో ఢిల్లీ బుల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న… మోర్గాన్ ఒలంపిక్స్ లో టీ10 ఫార్మాట్ క్రికెట్ ను చేర్చాలి అని అన్నారు.…
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నేడు జియోఫ్ అల్లార్డిస్ ను కొత్త శాశ్వత సీఈఓగా నియమించింది. అల్లార్డిస్ మాజీ ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆటగాడు. క్రికెట్ ఆస్ట్రేలియాలో గతంలో ఇదే విధమైన పాత్రను నిర్వహించి… ఎనిమిదేళ్లపాటు ఐసీసీ జనరల్ మేనేజర్ గా ఉన్నాడు. ఇక ఐసీసీ సీఈఓ గా నియమించినబడిన తర్వాత అల్లార్డిస్ మాట్లాడుతూ… “ఐసీసీ కి సీఈఓ గా నియమించబడటం గొప్ప అదృష్టం. అలాగే ఆటలో కొత్త దశ వృద్ధిలోకి ప్రవేశించినప్పుడు క్రీడను నడిపించే అవకాశం ఇచ్చినందుకు…
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా నియమిస్తున్నట్లు తాజాగా ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్కే ప్రకటించారు. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్ళలో ఒకడిగా… నిర్వాహకుడిగా తనకు ఉన్న అనుభవం ముందుకు వెళ్లడంలో మాకు సహాయపడుతుంది అని బార్కే ప్రకటించాడు. అయితే ఇంతకు ముందు వరకు ఈ పదవిలో భారత మాజీ స్పిన్నర్… గంగూలీ స్నేహితుడు అనిల్ కుంబ్లే ఉన్నాడు. ఇక గత తొమ్మిదేళ్లుగా ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా ఉండి అంతర్జాతీయ…
క్రికెట్ అభిమానులకు శుభవార్త చెప్పింది ఐసీసీ. 2024 నుంచి 8 ఐసీసీ టోర్నమెంట్ల వేదికలను ప్రకటించింది. 14 దేశాల్లో ఈ టోర్నమెంట్లు జరుగనున్నాయి. 2024 టీ 20 వరల్డ్ కప్ యూఎస్ఏ, వెస్టిండీస్ లో జరుగనుంది. 2025 చాంపియన్ ట్రోపికి పాకిస్తాన్ వేదిక కానుంది. అలాగే… 2026 టీ20 వరల్డ్ కప్ ఇండియా, శ్రీలంక లో జరుగనుంది. ఇక 2027 వరల్డ్ కప్ కు సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలు కానున్నాయి. అలాగే… 2028 టీ20 వరల్డ్…
ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచ కప్ నిర్వహణ హక్కులు మన బీసీసీఐ కి ఉన్న కరోనా కారణంగా దానిని యూఏఈ వేదికగా నిర్వహించాల్సి వచ్చింది. ఇక వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2022 ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. కాబట్టి ఇప్పుడు అందరూ దాని వైపు చూస్తున్నారు. ఇక తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా కూడా టీ20 ప్రపంచ కప్ 2022 నిర్వహించే వేదికలను ప్రకటిచింది. ఈ ప్రపంచ కప్ లో…
టీ20 ప్రపంచకప్ ముగియడంతో ఈ టోర్నీలో మోస్ట్ వాల్యుబుల్ ఆటగాళ్లతో కూడిన జాబితాను ఐసీసీ ప్రకటించింది. ఈ టీమ్లో భారత్ నుంచి ఒక్కరికి కూడా చోటు లభించలేదు. మొత్తం ఆరు జట్ల ఆటగాళ్లను ఐసీసీ పరిగణనలోకి తీసుకుంది. ఈ జట్టుకు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ను సారథిగా ఐసీసీ పేర్కొంది. ఐసీసీ ప్రకటించిన టీమ్లో ఛాంపియన్గా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు నుంచి ముగ్గురు ఆటగాళ్లు, ఇంగ్లండ్ నుంచి ఇద్దరు ఆటగాళ్లు, దక్షిణాఫ్రికా నుంచి ఇద్దరు ఆటగాళ్లు, శ్రీలంక…
క్రికెట్ లో కొన్ని సెంటిమెంట్ లు కొనసాగుతూ ఉంటాయి. ఇదే సమయంలో కొన్ని కొత్త సెంటిమెంట్ లు వస్తాయి. తాజాగా నిన్న జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో న్యూజిలాండ్ జట్టు ఓడిపోయిన తర్వాత ఓ కొత్త సెంటిమెంట్ ను అభిమానులు తెరపైకి తెచ్చారు. అయితే ఐసీసీ టోర్నీలో ఫైనల్స్ కు చేరుకున్న రెండు జట్ల కెప్టెన్ లు ట్రోఫీని పట్టుకొని ఫోటో దిగుతారు. అయితే ఆ ఫోటో సమయంలో ట్రోఫీకి ఎడమ వైపు ఏ…
ప్రపంచ కప్ టోర్నీలో టాస్ ఓ సమస్యగా ఉంది అని భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ అన్నారు. అయితే ఈ టోర్నీలో సెకండ్ బ్యాటింగ్ చేసిన వారికి లాభం ఉంటుందని చెప్పారు. ఇది ఐసీసీకి ఓ సమస్య చెప్పిన ఆయన.. దీని పై ఐసీసీ చర్చించాలని… రెండు జట్లకు మైదానం ఒకే విధంగా ఉండేలా చూసుకోవాలని గవాస్కర్ తెలిపారు. అయితే నిన్న జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆసీస్ ముందు భారీ లక్ష్యమే…
ప్రస్తుతం యూఏఈ లో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2021 జరుగుతున్న విషయం తెలిసిందే అయితే ఈ సమయంలో తాజాగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ను ప్రకటించింది. అందులో ఇంకా ఇంగ్లాండ్ క్రికెటర్ డేవిడ్ మాలన్ మొదటి స్థానంలో కొనసాగుతుండగా పాకిస్థాన్ క్రికెటర్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక భారత కెప్టెన్ కోహ్లీ 5వ స్థానానికి పడిపోయాడు. అయితే సౌత్ ఆఫ్రికా ఆటగాడు ఐడెన్ మార్క్రామ్ మూడో స్థానానికి రావడంతో పాక్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ నాలుగో…
యూఏఈ వేదికగా బీసీసీఐ ఈ ఏడాది ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రపంచ కప్ కు సంబంధించిన ప్రైజ్ మనీ వివరాలను తాజాగా ఐసీసీ ప్రకటించింది. ఈ ప్రపంచ కప్ లో విజయం సాధించిన జట్టుకు మొత్తం 1.6 మిలియన్ డాలర్స్ ఇవ్వనుంది ఐసీసీ. అంటే అక్షరాల 12,02,10,400 రూపాయలు. ఇక ఈ టోర్నీలో రన్నరప్ గా నిలిచినా జట్టుకు 8 లక్షల డాలర్స్ అందనున్నాయి. అలాగే సెమిస్…